Sandeep Vanga: మూడేళ్ళకి మూడో సినిమా.. సందీప్ ఇంత గ్యాప్ ఎందుకు ఎందుకు?
అర్జున్ రెడ్డితో తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి క్రేజ్ ఓరేంజ్ లో ఉన్నా.. సినిమాలు మాత్రం పెరగడం లేదు. అందరూ కథలు వింటున్నారు కానీ ఒక్కరు కూడా ఓకే అనడం లేదు. అందుకే ఎప్పుడో 2017లో అంటే 5 ఏళ్లక్రితం వచ్చిన సందీప్ జస్ట్ రెండంటేరెండు సినిమాలు చేశాడు.

Sandeep Vanga
Sandeep Vanga: అర్జున్ రెడ్డితో తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి క్రేజ్ ఓరేంజ్ లో ఉన్నా.. సినిమాలు మాత్రం పెరగడం లేదు. అందరూ కథలు వింటున్నారు కానీ ఒక్కరు కూడా ఓకే అనడం లేదు. అందుకే ఎప్పుడో 2017లో అంటే 5 ఏళ్లక్రితం వచ్చిన సందీప్ జస్ట్ రెండంటేరెండు సినిమాలు చేశాడు. మళ్ళీ ఇన్నాళ్లకి మూడో సినిమా మొదలుపెట్టాడు. ఇంతకీ సందీప్ రెడ్డి గ్యాప్ ఇచ్చాడా..? వచ్చిందా..?
Sandeep Vanga : పుష్పలో ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగాకు నచ్చిన సీన్ ఇదే!
సందీప్ రెడ్డి తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా చేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. అదే సినిమాని కబీర్ సింగ్ టైటిల్ తో బాలీవుడ్ లో షాహిద్ కపూర్, కియారాతో రీమేక్ చేసి అక్కడా బంపర్ హిట్ కొట్టారు సందీప్ రెడ్డి. 200 కోట్లకు పైగా కలెక్షన్లతో కబీర్ సింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంకేముంది వరుసగా సినిమాలు చేస్తారనుకుంటే కబీర్ సింగ్ వచ్చిన మూడేళ్ళకి మూడో సినిమా మొదలుపెట్టారు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా అనౌన్స్ చేసిన యానిమల్ మూవీ తాజాగా సెట్స్ మీదకెళ్లింది.
Upcoming Movies: ఒక హీరో కోసం రాసిన కథ.. మరో హీరోతో సినిమా!
సందీప్ వంగా.. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసినా, బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా.. అది అక్కడి వరకే. అర్జున్ రెడ్డి తర్వాత.. సందీప్ చాలా మందికి కథలు చెప్పారు. అయితే అవేవీ వర్కవుట్ అవ్వకపోవడంతో సందీప్.. కాస్త గ్యాప్ తీసుకున్నారు. అందుకే ఈ 2 సినిమాల తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకని మూడో సినిమా స్టార్ట్ చేశాడు సందీప్. రణబీర్, రష్మిక జంటగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ యానిమల్ మూవీ అనౌన్స్ చేసిన చాలా కాలం తర్వత హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ మొదలుపెట్టింది.
Crazy Combinations: వావ్.. క్రేజీ కాంబినేషన్స్..!
2017తో అర్జున్ రెడ్డి సినిమా చేసిన సందీప్.. 2019లో కబీర్ సింగ్ రీమేక్ చేశాడు. ఆ తర్వాత 2021లో యానిమల్ సినిమా అనౌన్స్ చేసిన సందీప్.. 2022లో యానిమల్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. సినిమా సినిమాకి మినిమం రెండేళ్లు టైమ్ తీసకుంటున్న సందీప్ రెడ్డి.. గ్యాప్ వస్తోందా..? అసలు ప్రాబ్లమ్ ఎక్కడుంది అనేది మాత్రం తెలీడం లేదు. ఏది ఏమైనా రెండేళ్లు, మూడేళ్లు గ్యాప్ వచ్చినా.. ముచ్చటగా మూడో సినిమాని మాత్రం లేట్ అయినా లేటెస్ట్ గానే చేస్తున్నారని టాక్.
Kondaveeti Simham : ఇండస్ట్రీ రికార్డ్.. 40 ఏళ్ల ‘కొండవీటి సింహం’
కబీర్ సింగ్ సక్సెస్ తర్వాత ఈ యంగ్ డైరెక్టర్ కంప్లీట్ గా బాలీవుడ్ మీదే కాన్సన్ ట్రేట్ చేశారు. రెండు మూడు కథలను సిద్దం చేసుకున్న సందీప్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని హిందీలోనే అని అనౌన్స్ చేశారు. కబీర్ సింగ్ కి నిర్మాతలుగా ఉన్న భూషణ్ కుమార్, మురద్ కేతాని తోనే సినిమా ఓకే అయ్యిందన్న టాక్ నడిచింది.
SPIRIT : ‘స్పిరిట్’ అంటే అర్థం ఇదేనంట..!
రణబీర్ కపూర్ హీరోగా క్రైమ్ డ్రామా రెడీ అవుతోందని బాలీవుడ్ లో వినిపిస్తున్న రూమర్స్ ని అఫీషియల్ చేశారు సందీప్ రెడ్డి. యానిమల్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఈ శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ లో స్టార్టయ్యింది. హీరోయిన్ గా పరిణీతి చోప్రా ప్లేస్ లో సౌత్ హీరోయిన్ రష్మిక ని ఫిక్స్ చేశారు టీమ్.