Gamblers : ఆకట్టుకుంటున్న సంగీత్ శోభన్ ‘గ్యాంబ్లర్స్’ టీజర్..
సంగీత్ శోభన్ నటిస్తున్న చిత్రం గ్యాంబ్లర్స్

Sangeeth Shobhan Gamblers Teaser out now
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు హీరో సంగీత్ శోభన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం గ్యాంబ్లర్స్. కేఎస్‌కే చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రశాంతి చారులింగ కథానాయిక. రాకింగ్ రాకేశ్, పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సునీత, రాజ్‌కుమార్ బృందావనం స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా టీజర్‌ను విడుదల చేసింది.
Kandula Durgesh : సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకున్నామా?: కందుల దుర్గేష్
ఇదొక వైవిధ్యమైన కథతో మిస్టరీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్నట్లు ఇటీవల దర్శకుడు చైతన్య తెలిపారు. సంగీత్ నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రం ఇది అని అన్నారు. ఇందులోని థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాయని తెలిపారు.