Double Ismart : డబుల్ ఇస్మార్ట్ షూటింగ్‌లో గాయపడిన సంజయ్ దత్..?
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Sanjay Dutt
Double Ismart shooting : పూరీ జగన్నాధ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart). 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (ISmart Shankar) సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ నటిస్తోండగా పూరి కనెక్ట్స్ పై ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్ర రెండో షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. కాగా.. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఓ నటుడు గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గాయపడినట్లు తెలుస్తోంది. కత్తితో స్టంట్స్ చేస్తుండగా సంజయ్ దత్ తలకు గాయమైంది. వెంటనే అతడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా రెండు కుట్లు కూడా పడ్డాయి. కాగా.. కుట్లు వేయించుకున్న వెంటనే 64 ఏళ్ల సంజయ్ దత్ సెట్స్ కు వచ్చి షూటింగ్‌లో పాల్గొనట్లు ఆ వార్తల సారాంశం.
కాగా.. జూలైలో సంజయ్ దత్ పాత్రను ‘బిగ్ బుల్’గా అభిమానులకు పరిచయం చేసింది చిత్ర బృందం. అతడి పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఫంకీ హెయిర్ స్టైల్‌తో సిగరెట్ తాగుతున్న ఈ పోస్టర్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం 2024 మార్చి 8న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. బోయపాటి దర్శకత్వంలో రామ్ ‘స్కంద’ మూవీలో నటిస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram