Sarath Babu : శరత్ బాబు, రమాప్రభల కథ ఏంటి.. పెళ్లి అయిందా? సహజీవనమా?
శరత్ బాబు తనకంటే 5 ఏళ్ళ పెద్ద వయసు ఉన్న రమాప్రభని ఎందుకు వివాహం చేసుకున్నారు. అవకాశాలు, ఆస్తి కోసమే అంటూ ఎన్నో విమర్శలు..

Sarath Babu Rama Prabha relationship and divorce story in telugu
Sarath Babu : టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు నేడు (మే 22) కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ వస్తున్నారు. ఏప్రిల్ 21న హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ (AIG) హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయిన శరత్ బాబు.. మల్టీ ఆర్గాన్స్ పూర్తి గా డ్యామేజ్ అవ్వడంతో నేడు తుదిశ్వాస విడిచారు. కాగా శరత్ బాబు వయసులో తనకంటే 5 ఏళ్ళ పెద్ద వయసు అయిన అలనాటి నటి రమాప్రభతో (Rama Prabha) ప్రేమలో పడి వివాహం చేసుకోడవడం సంచలన విషయం అయింది.
Sarath Babu : శరత్ బాబు సినీ ప్రయాణం.. IPS అవ్వాలి అనుకోని!
అయితే వీరిద్దరి బంధం ఎక్కువ కాలం నిలువ లేదు. 14 ఏళ్ళు రిలేషన్‌షిప్ తరువాత ఇద్దరు విడిపోయారు. అసలు వీరిద్దరి కథ ఏంటి? వారిద్దరి మధ్య ఏమైంది? అనేది తెలుసుకుందాం. సినిమాలో నటించాలని మద్రాస్ వచ్చి ‘రామరాజ్యం’ సినిమాతో హీరోగా పరిచయమైన శరత్ బాబుకి ఆ తరువాత మళ్ళీ పెద్దగా అవకాశాలు అందలేదు. ఆ సమయంలోనే రమాప్రభతో శరత్ బాబుకి పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆమె ఇండస్ట్రీలో స్టార్ గా ఉండడం, ఎంతో మంది అగ్ర దర్శకుల పరిచయాలు ఉండడంతో.. శరత్ బాబు కెరీర్ కి ఆమె పరిచయం సహాయ పడింది.
కానీ అవకాశాలు అందడానికి పరిచయాలు మాత్రమే సరిపోవు కదా. ఎంతో కొంత టాలెంట్ కూడా ఉండాలి. అలా రమాప్రభ పరిచయం, తన టాలెంట్ ఇండస్ట్రీలో శరత్ బాబుని అందరూ గుర్తించేలా చేసింది. అయితే ఈ ప్రయాణంలో శరత్ బాబు, రమాప్రభల మధ్య ప్రేమ చిగురించింది. ఎవరిది మొదటి ప్రపోజల్ అనే నిజం కంటే వీరిద్దరూ అనోన్యయంగా కలిసి జీవించారనేది నిజం. కొంత కాలం తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.
Music director Raj : ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత
ఇక ఈ విషయాలు గురించి శరత్ బాబు మాట్లాడుతూ.. ‘ప్రపంచం అంటే ఏంటో తెలియని ఒక వయసులో తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయం అది’ అని చెప్పుకొస్తారు. అలాగే రమాప్రభ.. ‘ఇద్దరికి ఉన్న అవకాశం అలా చేయించింది’ అని చెప్పుకొస్తారు. అయితే వీరిద్దరూ అసలు పెళ్లి చేసుకోలేదు సహజీవనం చేశారు అంటూ వార్తలు వినిపిస్తుంటాయి. వివాహ బంధం గురించి కూడా వీరిద్దరూ ఎక్కువ మాట్లాడక పోవడంతో.. ఏది నిజం అయ్యి ఉంటుంది? అనే ప్రశ్న అలా మిగిలిపోయింది.
అయితే కొంతమంది మాత్రం ఇలా చెప్పుకొస్తుంటారు.. ‘ఇద్దరిది ప్రేమ వివాహం, పైగా వయసులో ఎంతో గ్యాప్ ఉంది. కాబట్టి ఏ గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకొని ఉంటారు’ అని వెల్లడిస్తుంటారు. అయితే వీరిద్దరి బంధం విడిపోయిన తరువాత.. శరత్ బాబు ఎన్నో విమర్శలు ఎదురుకున్నారు. అవకాశాలు, ఆస్తి కోసమే శరత్ బాబు రమాప్రభని పెళ్లి చేసుకున్నారు అంటూ వ్యాఖ్యానించేవారు.