Sarkaru Vaari Paata: సర్కారు వారి ‘బర్త్ డే బ్లాస్టర్’.. టైం ఫిక్స్!

చివరగా గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ తర్వాత వెంటనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణం వల్ల కుదరలేదు. సర్కారు వారి పాట మూవీ కంటే ముందే వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేయాలనుకున్నా వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా పరుశురాంతో కలిసి సర్కారు వారి పాటతో సిద్దమయ్యాడు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి ‘బర్త్ డే బ్లాస్టర్’.. టైం ఫిక్స్!

Sarkaru Vaari Paata

Updated On : August 7, 2021 / 10:11 PM IST

Sarkaru Vaari Paata: చివరగా గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ తర్వాత వెంటనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణం వల్ల కుదరలేదు. సర్కారు వారి పాట మూవీ కంటే ముందే వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేయాలనుకున్నా వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా పరుశురాంతో కలిసి సర్కారు వారి పాటతో సిద్దమయ్యాడు.

ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో మోస్ట్ అవెయిటింగ్ మూవీగా ఆసక్తిని పెంచింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, మిగతా పోస్టర్స్ కూడా భారీ హైప్ సొంతం చేసుకోగా ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో ఆ రోజు అభిమానులకు సరికొత్త కిక్ ఇచ్చేలా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 9న ఉదయం గం. 9:09 నిమిషాలకు స్పెషల్ వీడియో రిలీజ్ అవుతుందని వెల్లడించారు.

ఆ టీజర్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తుండగా.. దీంతో పాటు మొదటి పాటను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న అభిమానులకు నాన్ స్టాప్ అప్డేట్స్ ఇచ్చేలా మైత్రి మూవీ మేకర్స్ పెద్ద ప్లాన్ వేసినట్లు కనిపిస్తుంది. ఆగస్టు 9న మొదటి నిమిషంలో అంటే 12 గంటలకు ఒక పోస్టర్ ను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో ఒక స్పెషల్ టీజర్ ను విడుదల చేయనున్నారు.

బర్త్ డే బ్లాక్ బస్టర్ పేరుతో ఫస్ట్ రిపోర్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చిన పోస్టర్ లో చేతిలో బ్యాగ్ తో మహేష్ బ్యాక్ పోజ్ చూపించగా.. ఇప్పుడు GIF లో సూపర్ స్టార్ ఫ్రంట్ పోజ్ ని చూపించారు. ఇందులో మహేష్ తన నడుముకున్న బెల్ట్ ని గట్టిగా లాగి బిగించడం చూడవచ్చు. మహేష్ ఇక్కడ కూల్ గా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. మరి రేపు ఆ బ్లాక్ బస్టర్ అప్డేట్ ఎలా ఉంటుందో.. ఫ్యాన్స్ ఫెస్టివల్స్ ఏ రేంజిలో ఉంటాయో చూద్దాం!