Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్థత

సినీ నటుడు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో జారిపడిన కైకాల.. నొప్పి ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.

Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్థత

Kaikala Satya

Updated On : October 31, 2021 / 10:50 AM IST

Kaikala Satyanarayana: సినీ నటుడు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో జారిపడిన కైకాల.. నొప్పి ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే, సత్యనారాయణ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు కుటుంబ సభ్యులు. కైకాల వయస్సు ప్రస్తుతం 87ఏళ్లు.

కైకాల సత్యనారాయణ గత 60ఏళ్లుగా తెలుగు సినిమారంగంలో 777 సినిమాల్లో నటించాడు. నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసిన కైకాల.. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలు పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీ.

తెలుగు సినీ పరిశ్రమలో ఎస్‌వీ రంగారావు తర్వాత వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన కైకాల.. ఎన్టీఆర్‌తో ఎన్నో సినిమాల్లో నటించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న కైకాల లక్ష్మీనారాయణ జన్మించారు. 1960 ఏప్రిల్ 10వ తేదీన నాగేశ్వరమ్మతో వివాహం అవ్వగా.. కైకాలకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.