NTR 100 Years : ఎన్టీఆర్ ఇండస్ట్రీలో తండ్రిగా భావించే నటుడు ఎవరో తెలుసా?
సీనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కర్ని 'బ్రదర్' అంటూ సోదర భావంతో పిలిచేవారని మనందరికీ తెలుసు. మరి ఆయన ఇండస్ట్రీలో నాన్న అనే పిలిచే నటుడు ఎవరో తెలుసా?

senior ntr treats chittoor nagayya as father in industry 100 Years of NTR
100 Years of NTR : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనిపించుకున్న నందమూరి తారక రామారావుని (NT Rama Rao) తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. తెలుగు తెర పై నటుడి గానే కాదు రైటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా కళామతల్లికి ఎన్నో సేవలు అందించారు. జానపధం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం.. ఇలా ప్రతి జోనర్ లో ఆయనకి తిరుగు లేదని అనిపించుకున్నారు. సినిమా పరిశ్రమలో ఎంతో ఎత్తుకి ఎదిగిన ఎన్టీఆర్.. తోటి నటీనటులతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకునేవారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తొలి తరం హీరోయిన్ అయిన ‘పుండరీ భాయి’ని అమ్మ అని ప్రేమగా పిలిచేవారు. తన తల్లిని కాకుండా ఎన్టీఆర్ ఆమెను మాత్రమే అమ్మ అని పిలిచేవారట. అలాగే ఇండస్ట్రీలో తొలి తరం హీరోగా వెలిగిన ‘చిత్తూరు నాగయ్య’ను ఎన్టీఆర్ గురువుగా భావించేవారు. ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే నాగయ్య పై ఎన్టీఆర్ కి అపారమైన గౌరవం ఉండేదట. ఇక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత.. ఆయనని తండ్రిలా భావించేవారట. అంతేకాదు నాగయ్యను నాన్న అని కూడా సంబోధించేవారట.
NTR 100 Years : ఎన్టీఆర్ మహానటి సావిత్రిని ఏమని పిలిచేవారో తెలుసా?
కాగా ఎన్టీఆర్ శత జయంతి ఈ సంవత్సరం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో గత ఏడాది మే 28 నుంచే ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ అంటూ బాలకృష్ణ (Balakrishna) సంవత్సరాది వేడుకలను మొదలు పెట్టాడు. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా శత జయంతి అంకురార్పణ సభని కూడా చాలా ఘనంగా నిర్వహించారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచం మొత్తం ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా టెక్సాస్, ఖతార్ దోహా వంటి దేశాల్లో ఈ ఉత్సవాలు ఇటీవల జరిగాయి. ఇక ఈ నెల 20న కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుక కార్యక్రమం జరగనుంది. ఆ ఈవెంట్ కి బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరయ్యి ఒకే స్టేజి పై కనిపించనున్నారు.