Slumdog Millionaire : సూపర్ హిట్ స్లమ్ డాగ్ మిలీనియర్ కి సీక్వెల్.. ఈసారి కూడా ఆస్కార్ వస్తుందా..
స్లమ్ డాగ్ మిలీనియర్.. ఈ సినిమా వచ్చి ఎన్నో ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటికీ దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Sequel to Super Hit Slum Dog Millionaire movie
Slumdog Millionaire : స్లమ్ డాగ్ మిలీనియర్.. ఈ సినిమా వచ్చి ఎన్నో ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటికీ దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. భాషతో సంబంధం లేకుండా ఫాన్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. అయితే దీనికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాతో పాటు ఏకంగా 8 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. డానీ బాయిల్ దర్శకత్వంలో వచ్చిన స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలో దేవ్ పటేల్, ఫ్రీదా పింటో ప్రధాన పాత్రల్లో నటించారు.
అయితే 2009లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమా సీక్వెల్ చెయ్యడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఈ సినిమా సీక్వెల్ హక్కులను ‘బ్రిడ్జ్ 7’ అనే నిర్మాణ సంస్థ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ నిర్మాణ సంస్థను ఇటీవల స్టార్ట్ చేశారు. కానీ దీనికి సంబందించిన షూటింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారన్నది క్లారిటీ ఇవ్వలేదు.
Also Read : Shah Rukh Khan : ముఫాసాతో తనను పోల్చుకున్న షారుఖ్ ఖాన్.. నేను కూడా దానిలాగే చీకటిని అధిగమించానంటూ..
కాగా ఇటీవల ఈ సినిమా సీక్వెల్ గురించి డైరెక్టర్ సైతం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని సినిమాల సీక్వెల్స్ ఎంత కాలం తర్వాత వచ్చినా కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాంటి సినిమాల్లో స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమా కూడా ఒకటి. ఈ మూవీ కథకి భాష పరమైన హద్దులు ఉండవని ఈ సినిమా నిరూపించింది’ అంటూ తెలిపారు డైరెక్టర్ డానీ బాయిల్. ఇదొక హాలీవుడ్ సినిమా అయినప్పటికీ ఇండియాని బేస్ చేసి ఈ సినిమాను తీసుకొచ్చారు. ఇక ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన దేవ్ పటేల్, ఫ్రీదా పింటో సీక్వెల్ లో కూడా నటిస్తారా లేదా అన్నది తెలియాలి. దేవ్ పటేల్, ఫ్రీదా పింటో ప్రస్తుతం హాలీవుడ్ లో స్టార్స్ గా కొనసాగుతున్నారు. స్లమ్ డాగ్ మిలీనియర్ ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. మరి సీక్వెల్ కూడా ఆస్కర్స్ విన్ అవుతుందా చూడాలి.