Vasudev Rao : హీరోగా మారుతున్న సీరియల్ నటుడు.. ‘సిల్క్ శారీ’ అంటూ..

సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాసుదేవ్ రావు ఇప్పుడు హీరోగా మారుతున్నాడు.

Vasudev Rao : హీరోగా మారుతున్న సీరియల్ నటుడు.. ‘సిల్క్ శారీ’ అంటూ..

Serial Actor Vasudev Rao turned as Hero with Silk Saree Movie

Updated On : April 16, 2024 / 3:04 PM IST

Vasudev Rao : భార్యామణి, మందాకినీ, జానకి కలగనలేదు, రామసీత.. లాంటి పలు సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాసుదేవ్ రావు ఇప్పుడు హీరోగా మారుతున్నాడు. వాసుదేవ్ రావు హీరోగా రీవా చౌదరి, ప్రీతీ గోస్వామి హీరోయిన్స్ గా టి. నాగేందర్ దర్శకత్వంలో చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘సిల్క్ శారీ’.

రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సిల్క్ శారీ తెరకెక్కుతుంది. ఈ సినిమాతో వాసుదేవ్ రావు వెండితెరపైకి రానున్నాడు. తాజాగా నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మూవీ యూనిట్ అంతా పాల్గొనగా రాజ్ కందుకూరి చిత్రయూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు.

Also Read : Avantika Vandanapu : హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న అవంతిక వందనపు..

ఈ సందర్భంగా హీరోగా మారిన వాసుదేవ్ రావు మాట్లాడుతూ.. ఒక మంచి సబ్జెక్టుతో వస్తున్నాం. ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాని నిర్మాత నిర్మించారు. రాజ్ కందుకూరి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. సిల్క్ శారీ ప్రేక్షకులని మెప్పిస్తుంది అని తెలిపారు.