Jailer 2: జైలర్ 2 నుంచి బాలయ్య అవుట్.. పాన్ ఇండియా స్టార్ ని సెట్ చేసిన నెల్సన్
జైలర్ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2(Jailer 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Shah rukh khan doing a special role in rajinikanth Jailer 2 movie
Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి వచ్చిన లాస్ట్ బ్లాక్ బస్టర్ అంటే జైలర్ అనే చెప్పాలి. వయసుకు తగ్గ పాత్ర, ఆ పాత్రలో హీరోయిజం, ఎలివేషన్స్, మ్యూజిక్ వెరసి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. దర్శకుడు నెల్సన్ రజినీకాంత్ ని ఎలా చూపిస్తే ఆడియన్స్ హ్యాపీ ఫీలవుతారు అని తెలుసుకొని అలానే పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశాడు. దీంతో, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా రూ.700 కోట్ల కలక్షన్స్ రాబట్టి రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే, జైలర్ సినిమాలో రెండు స్పెషన్ క్యారెక్టర్స్ ను ఇంట్రడ్యూస్ చేశాడు నెల్సన్.
Sobhita Dhulipala: బ్లాక్ డ్రెస్ లో నాగ చైతన్య భార్య.. శోభితా హాట్ లుక్స్
వారిలో ఒకరు మోహన్ లాల్ కాగా, మరొకరు శివరాజ్ కుమార్. సినిమా క్లైమాక్స్ లో ఈ రెండు పాత్రల ఎంట్రీ అద్భుతంగా సెట్ అయ్యింది. అయితే, జైలర్ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2(Jailer 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, జైలర్ లో మాదిరిగానే జైలర్ 2 సినిమాలో కూడా రెండు స్పెషల్ పాత్రలను ఇంట్రడ్యూస్ చేయనున్నాడట దర్శకుడు. వారిలో ఒకరు నందమూరి బాలకృష్ణ ఉంటారు అని చాలా కాలంగా న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి.
అయితే, తాజాగా సమాచారం మేరకు ఈ రోల్ నుంచి బాలకృష్ణను తప్పించాడట దర్శకుడు. ఆయన స్థానంలో పాన్ ఇండియా స్టార్ షారుఖ్ ఖాన్ ను తీసుకుంటున్నాడట. షారుక్ అయితే పాన్ ఇండియా లెవల్లో ఫుల్ క్రేజ్ ఉన్న పర్సనల్ కాబట్టి ఆయనైతే సినిమాకు కూడా బాగా హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నాడట దర్శకుడు నెల్సన్. అయితే, ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రెండో పాత్రలో ఎవరు చేస్తున్నారు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
