Shah Rukh Khan: ప‌బ్లిక్‌గా మ‌హిళా అభిమాని చేసిన ప‌నికి షాకైన షారుఖ్ ఖాన్‌.. ఏం చేసిందో తెలుసా..?

తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan ) ఓ మ‌హిళా అభిమాని చేసిన ప‌ని వ‌ల్ల కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు.

Shah Rukh Khan: ప‌బ్లిక్‌గా మ‌హిళా అభిమాని చేసిన ప‌నికి షాకైన షారుఖ్ ఖాన్‌.. ఏం చేసిందో తెలుసా..?

Shah Rukh Khan

Updated On : June 14, 2023 / 3:46 PM IST

Shah Rukh Khan : సినీ తార‌ల‌కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఒక్కొసారి అభిమానులు చేసే ప‌నుల వ‌ల్ల స్టార్స్ ఇబ్బందులు ప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan ) ఓ మ‌హిళా అభిమాని చేసిన ప‌ని వ‌ల్ల కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు.

ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు షారుఖ్ ఖాన్ దుబాయ్ కు వెళ్లాడు. మంగ‌ళ‌వారం(జూన్ 13) స‌ద‌రు ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్ ఉండ‌గా ఆ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన అతిథులు, అభిమానుల‌తో ఆయ‌న కాసేపు ముచ్చ‌టించారు. ఈ స‌మ‌యంలో అభిమానులు అత‌డితో క‌ర‌చాల‌నం చేసేందుకు పోటీ ప‌డ్డారు. అదే సమ‌యంలో ఓ మ‌హిళా అభిమాని బాద్ షాను ముద్దు పెట్టుకుంది. ఆ స‌మ‌యంలో షారుఖ్ ఖాన్ బాడీ గార్డులు, ఆయన మేనేజర్ పూజా దద్లానీ కూడా అక్క‌డే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Chiranjeevi : చరణ్ & ఉప్సి అంటూ.. స్పెషల్‌గా పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్..

ఆ వీడియోలో అభిమాని అతనితో కరచాలనం చేయడం, అతని చేతిని ముద్దు పెట్టుకోవడం కనిపించింది. మరోవైపు ఒక మహిళా అభిమాని వచ్చి, “నేను మీకు ముద్దు ఇవ్వవచ్చా? అని కింగ్ ఖాన్ అడిగింది. అత‌డు స‌మాధానం చెప్ప‌క‌ముందే.. ఆమె అత‌డి ముఖం ప‌ట్టుకుని చెంప‌పై ముద్దు పెట్టుకుని త‌న కోరిక తీర్చుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అనుకోని ఈ ఘ‌ట‌న‌పై షారుఖ్ కాస్త సిగ్గు ప‌డిన‌ట్లు కనిపించింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నెటీజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఆమెను జైలులో వేయండి అని ఒక‌రు కామెంట్ చేయ‌గా ఆమె అదృష్ట‌వంతురాలు అంటూ మ‌రొక‌రు అన్నారు.

Shah Rukh Khan kissed (forcefully?) by female fan
by u/humanbeing3333 in BollyBlindsNGossip

Shah Rukh Khan : నువ్వేమైనా ఫుడ్ ఆర్డర్ పెడతావా అన్నందుకు.. షారుఖ్ ఇంటికి ఫుడ్ డెలివరీస్!

ప‌ఠాన్ సినిమా స‌క్సెస్‌తో షారుఖ్ ఖాన్ పుల్ జోష్‌లో ఉన్నాడు. ప్ర‌స్తుతం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో జ‌వాన్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార, సన్యా మల్హోత్రా కూడా నటిస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.