Salman – Shahrukh : సల్మాన్ బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో షారుఖ్ సందడి..
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నేటితో 57వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో నిన్న రాత్రి సల్మాన్ సోదరి తన ఇంటిలో ఒక గ్రాండ్ పార్టీని నిర్వహించింది. ఈ పార్టీలో బాలీవుడ్ లోని పలువురు స్టార్స్ పాల్గొని సందడి చేశారు. ఇక ఈ పార్టీకి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా హాజరయ్యాడు.

Shah rukh khan in salman khan birthday celebrations
Salman – Shahrukh : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నేటితో 57వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో ఈ కండల వీరుడికి అభిమానులు నుంచి, సినీ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో వెంకటేష్ కూడా విష్ చేశాడు. కాగా నిన్న రాత్రి సల్మాన్ సోదరి తన ఇంటిలో ఒక గ్రాండ్ పార్టీని నిర్వహించింది. ఈ పార్టీలో బాలీవుడ్ లోని పలువురు స్టార్స్ పాల్గొని సందడి చేశారు.
Salman Khan : సల్మాన్ ఖాన్‌కి వెంకీ మామ బర్త్ డే విషెస్.. వైరల్ అవుతున్న ఫోటో!
ఇక ఈ పార్టీకి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా హాజరయ్యాడు. సల్మాన్ తో కలిసి షారుఖ్ ఒక చోట కనిపించడం ఇద్దరి అభిమానులకు కన్నులు విందులగా ఉంది. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారడంతో.. ఫ్యాన్స్ వాటిని లైక్లు, షేర్లు చేస్తూ సందడి చేస్తున్నారు. షారుఖ్ నటిస్తున్న తాజా చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ పార్టీకి పూజ హెగ్డే, జాన్వీ కపూర్, టబు, సోనాక్షి సిన్హా, సునీల్ శెట్టి, రితేశ్, జెనీలియా, కార్తీక్ ఆర్యన్.. మరికొందరు సెలెబ్రెటీస్ ఈ పార్టీలో సందడి చేశారు. ప్రస్తుతం సల్మాన్.. పవన్ కళ్యాణ్ కాటమరాయుడుకి రీమేక్ లో ‘కిసికా భాయ్ కిసికి జాన్’ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక పాత్ర చేస్తున్నాడు. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక పాటలో సల్మాన్ అండ్ వెంకీ మామతో కలిసి చిందేయనున్నాడు.
The way they hug each other , there is so much love & brotherhood ♥️#HappyBirthdaySalmanKhan pic.twitter.com/JTfXYZXhMa
— Shah Rukh Khan Fc – Pune ( SRK Fc Pune ) (@SRKFC_PUNE) December 27, 2022