Jawan Collections : జవాన్ 10 రోజుల కలెక్షన్స్.. షారుఖ్ మరో 1000 కోట్ల సినిమా..
షారుఖ్ ఖాన్ జవాన్ కలెక్షన్స్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ మూవీ 10 రోజుల్లో..

Shah Rukh Khan Jawan movie ten days Collections
Jawan Collections : పఠాన్ తరువాత షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన సినిమా ‘జవాన్’. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నయనతార(Nayanathara) హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్ గా చేశాడు. ప్రియమణి, దీపికా పదుకొనే.. మరికొంతమంది స్టార్స్ ముఖ్య పాత్రలు చేశారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు వెళ్తుంది.
Bhagavanth Kesari : ‘భగవంత్ కేసరి’ దసరాకి రావడం కష్టమా.. బ్యాలన్స్ షూట్..!
మొదటి నాలుగు రోజుల్లో డేకి 100 కోట్ల చొప్పున నాలుగు వందల కోట్ల పైగా కలెక్షన్స్ ని అందుకున్న ఈ మూవీ.. 1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టడం ఖాయం అనుకున్నారు. అయితే ఆ తరువాత కలెక్షన్స్ రాబట్టడంలో కొంత స్లో అవ్వడంతో.. వెయ్య కోట్ల కలెక్షన్స్ పై కొంత సందేహం నెలకుంది. కానీ సెకండ్ వీకెండ్ లో ఈ మూవీ కలెక్షన్స్ దూకుడు చూస్తుంటే.. షారుఖ్ ఖాన్ కి మరో 1000 కోట్ల సినిమా కన్ఫార్మ్ అయ్యినట్లే అంటున్నారు. తాజాగా ఈ మూవీ 10 డేస్ కలెక్షన్స్ ని దర్శకుడు అట్లీ తెలియజేశాడు.
Mounika Reddy : లేడీ ఓరియెంటెడ్ సినిమాతో హీరోయిన్గా మోనిక రెడ్డి ఎంట్రీ..
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 10 రోజుల్లో దాదాపు 797.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో మరో పెద్ద సినిమా లేదు. ఇటు సౌత్ కూడా మరో వారం వరకు పెద్ద సినిమాల రిలీజ్ లు లేవు. దీంతో ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టడం చాలా ఈజీ అంటున్నారు. కాగా షారుఖ్ పఠాన్ మూవీతో ఇప్పటికే ఒక సినిమాని వెయ్య కోట్ల క్లబ్ లో పెట్టాడు. ఇప్పుడు ఈ మూవీ కూడా ఆ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తే.. రెండు సినిమాలు ఉన్న హీరోగా షారుఖ్ కొత్త రికార్డుని క్రియేట్ చేసినట్లు అవుతుంది.
View this post on Instagram