Shah Rukh Khan : షారూఖ్ పాటను చూస్తూ ఎంజాయ్ చేసిన పిల్లి.. రెస్పాండ్ అయిన షారూఖ్ ఖాన్

జంతువులకు కూడా సినిమా స్టార్లంటే అభిమానం ఉంటుందా? ఏమో మరి.. ఓ పిల్లి ఎంతో శ్రద్ధగా షారూఖ్ ఖాన్ సినిమా పాటను చూస్తోంది. ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై షారూఖ్ ఖాన్ స్పందించారు కూడా.

Shah Rukh Khan : షారూఖ్ పాటను చూస్తూ ఎంజాయ్ చేసిన పిల్లి.. రెస్పాండ్ అయిన షారూఖ్ ఖాన్

Shah Rukh Khan

Updated On : June 13, 2023 / 3:04 PM IST

Viral Video : ఇటీవల కాలంలో జంతువులు కూడా టీవీలు, మొబైల్ ఫోన్స్ చూస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా షారూఖ్ ఖాన్ పాటను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న పిల్లి వీడియో వైరల్ అవుతోంది. దీనిపై షారూఖ్ ఖాన్ స్పందించారు.

Rajamouli : రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా.. ఆ యాడ్ లో నటిస్తున్నారా? వైరల్ అవుతున్న వీడియో..

సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఏజ్ పెరుగుతున్నా ఆయనపై ఫ్యాన్స్‌కి అభిమానం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఇక రీసెంట్‌గా వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఆయనను జంతువులు కూడా అభిమానిస్తున్నట్లు అనిపిస్తోంది.
తియా శ్రీ ఇరేరా (Tia Sri Irera) అనే ట్విట్టర్ యూజర్ షారూఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ టైటిల్ ట్రాక్‌ని తన ఫోన్‌లో ప్లే చేస్తుంటే అతని పెంపుడు పిల్లి ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ క్లిప్‌ను షేర్ చేస్తున్నప్పుడు ‘హాయ్ సార్.. నా పిల్లి మిమ్మల్ని ప్రేమిస్తోంది’ అనే శీర్షికతో పోస్ట్ చేశాడు.

SSMB28 : మహేష్ బాబు సినిమా షెడ్యూల్, టీజర్, టైటిల్ పై ఆసక్తికర న్యూస్.. ట్విట్టర్‌లో వైరల్!

దీనిపై షారూఖ్ స్పందిస్తూ ‘నా ప్రేమను పిల్లికి ఇవ్వండి.. ఇకపై నా సినిమాలు కొన్ని డాగ్స్ కూడా ఇష్టపడుతూ చూడటం ప్రారంభించాలి.. అప్పుడు నేను సెట్ అవుతాను’ అంటూ రీట్వీట్ చేశారు. ఇక ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయితే షారూఖ్ ఖాన్ ట్విట్టర్‌లో అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అమిత్ భావ్‌సర్ అనే ట్విట్టర్ యూజర్ తన అమ్మమ్మకి షారూఖ్ ఖాన్ అంటే ఎంతో అభిమానం అంటూ వీడియోను షేర్ చేస్తూ షారూఖ్ కి ట్యాగ్ చేశారు. అప్పుడు షారూఖ్ ‘ నేను కూడా ఆమెను ప్రేమిస్తున్నాను’ అంటూ రిప్లై ఇచ్చారు.