Shah Rukh Khan : గుండుతో మళ్లీ నటించనన్న షారూఖ్ కామెంట్స్ వైరల్
గుండుతో మళ్లీ నటించను అంటున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్. తాజాగా జవాన్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Shah Rukh Khan
Shah Rukh Khan : రీసెంట్‌గా రిలీజైన జవాన్ ట్రైలర్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఫస్ట్ టైం ఈ సినిమాలో గుండుతో కనిపిస్తారు. మళ్లీ గుండుతో నటించను అంటూ తాజాగా షారూఖ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆగస్టు 31న దుబాయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో జవాన్ ట్రైలర్ అట్టహాసంగా రిలీజ్ చేసారు మూవీ టీం. ఈ ట్రైలర్‌లో షారూఖ్ ఖాన్ గుండుతో ఉన్న లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ట్రైలర్ క్షణాల్లో వైరల్ అయ్యింది. షారూఖ్ మొదటిసారి ఈ సినిమాలో గుండుతో నటించారు. ఇక గుండు మీద పచ్చబొట్టు కూడా ఫ్యాన్స్‌ని ఆకర్షించింది. ఇదిలా ఉంటే జవాన్ ట్రైలర్ ఈవెంట్‌లో షారూఖ్ మాత్రం తను గుండుతో నటించడంపై కామెంట్లు చేశారు. ఈ సినిమాలో గుండుతో ఉన్నాను.. నేను ఈ క్యారెక్టర్‌లో చేయడం ఇదే మొదటి చివరిసారి’ అని స్పష్టం చేశారు.
Jawan Trailer : షారుఖ్ జవాన్ ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్ సీక్వెన్స్‌తో..
అట్లీ డైరెక్షన్‌లో రూపొందిన జవాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7 న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా నటించారు. జవాన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Of Justice & A Jawan.
Of Women & their Vengeance.
Of a Mother & A Son.
And of course, a lot of Fun!!!
Ready Ahhh!!!#JawanTrailer out now! #Jawan releasing worldwide on 7th September, 2023 in Hindi, Tamil & Telugu. pic.twitter.com/WwU95DJcK2— Shah Rukh Khan (@iamsrk) August 31, 2023