సోదరి మరణం – విషాదంలో కింగ్‌ఖాన్ కుటుంబం

షారుఖ్ ఖాన్ సోదరి నూర్ జెహాన్ (52) మరణంతో కింగ్‌ఖాన్ కుటుంబంలో విషాదం నెలకొంది..

  • Published By: sekhar ,Published On : January 29, 2020 / 06:17 AM IST
సోదరి మరణం – విషాదంలో కింగ్‌ఖాన్ కుటుంబం

Updated On : January 29, 2020 / 6:17 AM IST

షారుఖ్ ఖాన్ సోదరి నూర్ జెహాన్ (52) మరణంతో కింగ్‌ఖాన్ కుటుంబంలో విషాదం నెలకొంది..

బాలీవుడ్ బాద్‌షా, కింగ్‌ఖాన్ షారుఖ్ ఖాన్ ఇంట విషాదం నెలకొంది. షారుఖ్ సోదరి నూర్ జెహాన్ (52) మరణించారు. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు. జెహాన్‌ తండ్రి షారుక్‌కు పినతండ్రి అవుతారు. నూర్‌ జెహాన్‌ పెషావర్‌లోని కిస్సా ఖ్వానీ బజార్‌ సమీపంలోని మొహల్లా షా వాలి కతాల్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. కొంతకాలంగా జెహాన్‌ నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఆమె భర్త ఆసిఫ్‌ బుర్హాన్‌ పేర్కొన్నారు.

Shah Rukh Khan Cousin Noor Jehan Died In Peshawar - Sakshi

నూర్‌ మరణించిన విషయాన్ని ఆమె సోదరుడు మన్సూర్‌ అహ్మద్‌ సైతం ధృవీకరించారు. అదే విధంగా షారుక్‌ కుటుంబంతో నూర్‌ జెహాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి భారత్‌లో కూడా చాలామంది బంధువులు ఉ‍న్నారు. కాగా పాకిస్తాన్‌లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జెహాన్‌ జిల్లా, పట్టణ కౌన్సిలర్‌గా పనిచేశారు. అనంతరం జూలై 2018 సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక అసెంబ్లీకి నామినేషన్‌ దాఖలు చేసి తరువాత ఉపసంహరించుకున్నారు. 

Read Also : పవన్ కళ్యాణ్ 27 పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

 కింగ్‌ఖాన్‌ తన తల్లిదండ్రులతో కలిసి పెషావర్‌లోని నూర్‌ కుటుంబాన్ని రెండుసార్లు(1997,2011) సందర్శించారు. నూర్‌ మరణంతో  షారుఖ్‌, నూర్‌ జెహాన్‌తో కలిసి దిగిన ఫోటోలను అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.