Shahrukh Khan : KKR Vs RCB మ్యాచ్ కి కూతురితో కలిసి వచ్చిన షారుఖ్.. KKR గెలవడంతో డ్యాన్స్ వేసి రచ్చ రచ్చ
షారుఖ్ తన కోల్‌కత్తా ఆటగాళ్లతో మ్యాచ్ కు ముందు మాట్లాడి వారిని ఎంకరేజ్ చేశాడు. మ్యాచ్ సాగుతున్నంతసేపు గ్యాలరీలో కూర్చొని తమ టీంలో జోష్ నింపాడు. దీంతో షారుఖ్ అభిమానులు కూడా ఫుల్ ఫిదా అయ్యారు.

Shahrukh Khan and his daughter suhana khan (Photo : Instagram)
Shahrukh Khan : ప్రస్తుతం దేశమంతా IPL ఫీవర్ నడుస్తుంది. గురువారం(ఏప్రిల్ 6) నాడు కోల్‌కత్తా నైట్ రైడర్స్(KKR) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు(RCB) మ్యాచ్ కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) లో జరగగా ఈ మ్యాచ్ లో కోల్‌కత్తా(Kolkata) బెంగుళూరుపై(Benguluru) ఘన విజయం సాధించింది. దీంతో కోల్‌కత్తా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కోల్‌కత్తా జట్టు యజమాని షారుఖ్ ఖాన్(Shahrukh Khan )కూడా ఈ మ్యాచ్ కి వచ్చి సందడి చేశాడు.
షారుఖ్ తన కోల్‌కత్తా ఆటగాళ్లతో మ్యాచ్ కు ముందు మాట్లాడి వారిని ఎంకరేజ్ చేశాడు. మ్యాచ్ సాగుతున్నంతసేపు గ్యాలరీలో కూర్చొని తమ టీంలో జోష్ నింపాడు. దీంతో షారుఖ్ అభిమానులు కూడా ఫుల్ ఫిదా అయ్యారు. ఇక తమ టీం గెలవడంతో డ్యాన్స్ కూడా వేశాడు షారుఖ్. దీంతో షారుఖ్ డ్యాన్స్ వేసిన వీడియోలు వైరల్ గా మారాయి. పఠాన్ సక్సెస్ తర్వాత మొదటి సారి ఇలా బయటకి వచ్చి తమ కోల్‌కత్తా టీంని ఎంకరేజ్ చేస్తూ షారుఖ్ సందడి చేయడంతో అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు.
Siddharth – Aditi : సిద్దార్థ్‌తో కలిసి ప్రీమియర్ షోకి వచ్చిన అదితి.. ఇప్పటికైనా నమ్ముతారా?
ఇక ఈ మ్యాచ్ కి షారుఖ్ కూతురు సుహానా కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చింది. కోల్‌కత్తా జెండాలు పట్టుకొని మ్యాచ్ లో హడావిడి చేసింది. దీంతో సుహానా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మ్యాచ్ లో కోల్‌కత్తా గెలవడంతో షారుఖ్ గ్రౌండ్ లోకి వచ్చి మరీ ఆటగాళ్లతో కలిసి డ్యాన్స్ చేసి అలరించారు. మొత్తానికి నిన్నటి మ్యాచ్ తో అటు కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఫ్యాన్స్, ఇటు షారుఖ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.