Shanaya Kapoor: స్టార్ కిడ్స్ క్రేజీ గర్ల్స్ నైట్.. హోరెత్తిన సోషల్ మీడియా!

బాలీవుడ్ పార్టీ కల్చర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనేమో. వీకెండ్ వస్తే చాలు బీటౌన్ సెలబ్రిటీస్ పార్టీ మూడ్ లో రచ్చ చేసేస్తుంటారు. దక్షణాదిలో ఈ కల్చర్ ఉన్నా.. పబ్లిక్ లోకి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటే బాలీవుడ్ మాత్రం ఎప్పుడో ఇది ఓపెన్ చేసేసింది.

Shanaya Kapoor: స్టార్ కిడ్స్ క్రేజీ గర్ల్స్ నైట్.. హోరెత్తిన సోషల్ మీడియా!

Shanaya Kapoor

Updated On : July 3, 2021 / 9:07 PM IST

Shanaya Kapoor: బాలీవుడ్ పార్టీ కల్చర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనేమో. వీకెండ్ వస్తే చాలు బీటౌన్ సెలబ్రిటీస్ పార్టీ మూడ్ లో రచ్చ చేసేస్తుంటారు. దక్షణాదిలో ఈ కల్చర్ ఉన్నా.. పబ్లిక్ లోకి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటే బాలీవుడ్ మాత్రం ఎప్పుడో ఇది ఓపెన్ చేసేసింది. స్టార్ కిడ్స్ అయితే ఈ మధ్య క్రేజీ నైట్స్ పేరుతో ఒక చోట చేరి సెలబ్రేషన్స్ ఓ రేంజిలో ఉంటున్నాయి. తాజాగా అలాంటిది ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనాయా కపూర్ శుక్రవారం రాత్రి తన ఇంట్లో క్రేజీ గర్ల్స్ నైట్ సెలబ్రేట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ లో షనాయా ఫ్రెండ్స్ నటి అనన్య పాండే, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి చేసిన క్రేజీ గర్ల్స్ నైట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.

బ్లాక్ అండ్ డెనిమ్ డ్రెస్ కోడ్ తో చేసుకున్న ఈ పార్టీలో షనాయా బ్లాక్ స్లీవ్ లెస్ మాక్ నెక్ క్రాప్ టాప్.. జీన్స్ లో ట్రెండీగా కనిపిస్తే అనన్య బ్లాక్ లేస్-అప్ క్రాప్ టాప్ ను బ్లూ బ్లూడ్ డెనిమ్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక నవ్య ఆల్-బ్లాక్ స్లీవ్ లెస్ టాప్ మరియు ఫ్లేర్డ్ ప్యాంటులో హొయలు పోతూ ఇచ్చిన ఫోజులుకు నెట్టింట కామెంట్స్ మోత మ్రోగిపోతుంది. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ స్టార్ కిడ్స్ ఫోటోలకు షనాయా తండ్రి రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నారని కామెంట్స్ చేస్తే తనని కూడా వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చని షనాయా ఫన్నీ కామెంట్స్ చేసింది.

నిజానికి అనన్య, నవ్య, షనాయా క్లోజ్-నిట్ సర్కిల్‌లో భాగం కాగా ఇందులో సూపర్ స్టార్ షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ కూడా ఉండాల్సింది. అయితే సుహానా ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉండడంతో క్రేజీ నైట్స్ మిస్ అవుతుంది. కాగా, అనన్య, షనాయా తల్లులు కూడా 25 సంవత్సరాలకు పైగా స్నేహితులు కాగా ఈ మధ్యనే నెట్‌ఫ్లిక్స్ యొక్క స్మాష్ హిట్ ది ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్‌లో కలిసి నటించారు. అనన్య ఇప్పటికే సినిమాలతో బిజీగా ఉండగా షనాయా త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Shanaya Kapoor ? (@shanayakapoor02)