Aadavallu Meeku Johaarlu: ఆడవారిపై ధీమాతో శర్వా.. కలిసొచ్చిన జానర్ హిట్ ఇస్తుందా?

బ్యాక్ గ్రౌండ్ భారీగా లేదు కానీ హీరోగా ఎదిగాడు. మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. కానీ వరుస ఫ్లాపులు ఈమధ్య శర్వానంద్ ఫేట్ ను మార్చేశాయి. అందుకే మళ్లీ తనదైన స్టైల్లో అట్రాక్ట్..

Aadavallu Meeku Johaarlu: ఆడవారిపై ధీమాతో శర్వా.. కలిసొచ్చిన జానర్ హిట్ ఇస్తుందా?

Aadavallu Meeku Joharlu Teaser

Updated On : February 28, 2022 / 11:53 AM IST

Aadavallu Meeku Johaarlu: బ్యాక్ గ్రౌండ్ భారీగా లేదు కానీ హీరోగా ఎదిగాడు. మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. కానీ వరుస ఫ్లాపులు ఈమధ్య శర్వానంద్ ఫేట్ ను మార్చేశాయి. అందుకే మళ్లీ తనదైన స్టైల్లో అట్రాక్ట్ చేస్తాననేది ఈ యంగ్ హీరో వర్షన్. ఫ్యామిలీ స్టోరీనే నమ్ముకుని ఈసారి హిట్ కొడతానంటున్నాడు శర్వానంద్. మార్చ్ 4న రిలీజ్ కాబోతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాపై ఈ యంగ్ హీరో బాగానే హోప్స్ పెట్టుకున్నాడు.

Aadavallu Meeku Joharlu Teaser: కోపం.. బాధ.. టెన్షన్.. ఫ్రస్టేషన్.. ఇరిటేషన్ చూపించే శర్వా!

పడి పడి లేచే మనసు తర్వాత శర్వాను ఫ్లాప్స్ చుట్టుముట్టాయి. రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం ఇలా అన్నీ నిరాశనే మిగిల్చాయి. అందుకే తనకు కలిసొచ్చిన.. క్లాస్ టచ్ ఇచ్చిన టైప్ లోనే ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీని తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే కామెడీ మిక్స్ చేసిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీని డైరెక్టర్ కిషోర్ తిరుమల సూపర్ గా డీల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. సో డైరెక్షన్ కి తోడూ దేవీశ్రీ మ్యూజిక్, రష్మిక గ్లామర్, సీనియర్ హీరోయిన్స్ అట్రాక్షన్ ఈ మూవీకి ప్లస్ కాబోతున్నాయి.

Aadavallu Meeku Joharlu: టైటిల్ సాంగ్ రిలీజ్.. దేవిశ్రీ మార్క్ కిర్రాక్ అంతే!

అయితే చాలా కాలంగా సరైన సక్సెస్ లేకపోయినా మినిమం గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్న శర్వా.. రాబోతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఆ తర్వాత ఒకే ఒక జీవితం.. శర్వా ఫేట్ ను మార్చుతాయేమో చూడాలి. మొత్తంగా ఈసారికి రీల్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో వర్కవుట్ చేసి రియల్ హిట్ కొడతానంటున్న శర్వాకు ఆ ఆడవాళ్లు విజయం కట్టబెడతారా లేదా అన్నది మరో ఐదు రోజులలోనే తేలిపోతుంది.