Shekar Movie : నిలిచిపోయిన ’శేఖర్’ సినిమా

హీరో రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలని ఫైనాన్సియర్ పరంధామరెడ్డి కోర్టుకు వెళ్లాడు. కోర్టు ఆదేశాల మేరకు డబ్బు డిపాజిట్ చేయకపోవడంతో శేఖర్ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని సివిల్ కోర్టు ఆదేశించింది.

Shekar Movie : నిలిచిపోయిన ’శేఖర్’ సినిమా

Shekar

Updated On : May 22, 2022 / 4:49 PM IST

Shekar movie stopped : ‘శేఖర్’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ‘శేఖర్’ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. చిత్రాన్ని నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో అన్ని థియేటర్లలో శేఖర్ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. ఇటీవలే శేఖర్ మూవీ విడుదల అయిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ హీరోగా, జీవిత డైరెక్షన్ లో శేఖర్ మూవీని తెరకెక్కించారు. గత శుక్రవారమే శేఖర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే, హీరో రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలని ఫైనాన్సియర్ పరంధామరెడ్డి కోర్టుకు వెళ్లాడు. గతంలో ఫైనాన్సియర్ కు డబ్బులు డిపాజిట్ చేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు డబ్బు డిపాజిట్ చేయకపోవడంతో శేఖర్ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని సివిల్ కోర్టు ఆదేశించింది. దీంతో థియేటర్లలో శేఖర్ చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు.

Sekhar: రాజశేఖర్ సినిమాపై ఓటీటీల చూపు.. కళ్ళు చెదిరే ధర!

శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేయడంపై హీరో రాజశేఖర్ ట్వీట్ చేశారు. శేఖర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డామన్నారు. శేఖర్ మూవీకి అద్భుతమైన స్పందన వస్తుందని తెలిపారు. కొందరు కుట్రలు చేసి తమ మూవీని ప్రదర్శించకుండా ఆపారని ఆరోపించారు.