Shruti Haasan : హీరోలకు సమానంగా హీరోయిన్స్ కి రెమ్యునరేషన్ ఇచ్చే రోజు కోసం ఎదురుచూస్తున్నా..

కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ హీరోయిన్స్ రెమ్యునరేషన్ గురించి వ్యాఖ్యలు చేసింది. గతంలో ప్రియాంక చోప్రా హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకోవడానికి నేను రెండు దశాబ్దాలు కష్టపడాల్సి వచ్చింది అని చెప్పింది.

Shruti Haasan : హీరోలకు సమానంగా హీరోయిన్స్ కి రెమ్యునరేషన్ ఇచ్చే రోజు కోసం ఎదురుచూస్తున్నా..

Shruti Haasan comments on Heroins Remuneration at Cannes film festival

Updated On : May 24, 2023 / 6:39 AM IST

Shruti Haasan :  శ్రుతి హాసన్‌ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటీవల సంక్రాంతికి వాల్తేరు వీరయ్య(Waltair Veerayya), వీరసింహారెడ్డి(Veera SimhaReddy) సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టింది. త్వరలో సలార్(Salaar) సినిమాతో రాబోతుంది. మరిన్ని చిత్రాలు శ్రుతి హాసన్‌ చేతిలో ఉన్నాయి. తాజాగా శ్రుతి హాసన్‌ ఫ్రాన్స్(France) లో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన 76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్(Cannes Film Festival) లో పాల్గొంది. బ్లాక్ డ్రెస్ లో శ్రుతి హాసన్‌ కాన్స్ రెడ్ కార్పెట్ పై నడిచి ఆహా అనిపించింది.

ఇక కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ హీరోయిన్స్ రెమ్యునరేషన్ గురించి వ్యాఖ్యలు చేసింది. గతంలో ప్రియాంక చోప్రా హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకోవడానికి నేను రెండు దశాబ్దాలు కష్టపడాల్సి వచ్చింది అని చెప్పింది.

Bholaa Shankar : స్విట్జర్లాండ్‌లో తమన్నాతో చిరు డ్యూయెట్.. విడుదల వరకు చిరు లీక్స్ ఫిక్స్ అంటున్న మెగాస్టార్!

ఈ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ప్రియాంక చోప్రా అద్భుతం సాధించారు. మేమంతా ఇంకా కష్టపడుతున్నాం. మన దగ్గర సమాన వేతనం గురించి కనీస చర్చలు కూడా లేవు. హీరోలతో పాటు హీరోయిన్స్ కి సమాన రెమ్యునరేషన్ లభించే రోజు వస్తుందని ఎదురు చూస్తున్నాను అని తెలిపింది. దీంతో శ్రుతిహాసన్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.