Siddharth – Aditi Rao Hydari : సైలెంట్ గా పెళ్లి చేసేసుకున్న సిద్దార్థ్ – అదితి రావు హైదరి.. ఫొటోలు వైరల్..
తాజాగా సిద్దార్థ్ - అదితిరావు హైదరి ఒక్కటయ్యారు.

Siddharth and Aditi Rao Hydari Marriage Happened Photos goes Viral
Siddharth – Aditi Rao Hydari : హీరో సిద్దార్థ్ – హీరోయిన్ అదితిరావు హైదరి గత కొన్నాళ్ల నుంచి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్తుండటంతో వీరి ఫొటోలు, వీడియోలు వైరల్ అయి ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని అంతా భావించారు. కొన్నాళ్ల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకొని వీరి ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
Also Read : Anushka – Thaman : ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న అనుష్క.. ప్రతి సంవత్సరం తమన్‌కి ఆ గిఫ్ట్..
తాజాగా సిద్దార్థ్ – అదితిరావు హైదరి ఒక్కటయ్యారు. సిద్దార్థ్ – అదితి వివాహం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల మధ్యే వీరి వివాహం జరిగింది. నిశ్చితార్థం సైలెంట్ గా ఎవరికి తెలియకుండా చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి కూడా సైలెంట్ గా చేసేసుకున్నారు.
ఇక పలు పెళ్లి ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు సిద్దార్థ్ – అదితి. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సిద్దార్థ్ – అదితి ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.