Chaitu Jonnalagadda : నటుడి నుంచి రచయితగా మారుతున్న సిద్దు జొన్నలగడ్డ బ్రదర్ చైతూ జొన్నలగడ్డ..

ఇన్నాళ్లు నటుడిగా మెప్పించిన చైతూ ఇప్పుడు తనలోని రచయితని చూపించబోతున్నాడు.

Chaitu Jonnalagadda : నటుడి నుంచి రచయితగా మారుతున్న సిద్దు జొన్నలగడ్డ బ్రదర్ చైతూ జొన్నలగడ్డ..

Siddhu Jonnalagadda Brother Chaitu Jonnalagadda Turned as Writer and Hero

Updated On : October 19, 2024 / 2:46 PM IST

Chaitu Jonnalagadda : సిద్ధూ జొన్నలగడ్డ బ్రదర్ చైతూ జొన్నలగడ్డ పలు సినిమాల్లో నటుడిగా మెప్పించాడు. బబుల్‌‌గమ్‌, భామాకలాపం సినిమాల్లో అయితే తన నటనతో అదరగొట్టి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం పలు సినిమాలు, సిరిస్ లలో నటిస్తూ బిజీ అవుతున్న చైతూ జొన్నలగడ్డ ఇప్పుడు రచయితగా మారబోతున్నాడు.

ఇన్నాళ్లు నటుడిగా మెప్పించిన చైతూ ఇప్పుడు తనలోని రచయితని చూపించబోతున్నాడు. హీరోగా, రచయితగా MM2 అనే ఆసక్తికర సినిమాని మొదలుపెట్టాడు చైతూ. ఆల్రెడీ ఈ సినిమా పోస్టర్ కూడా ఇటీవల రిలీజ్ చేసారు. వరుస ఆఫర్లు వచ్చినా మంచి పాత్రలనే ఏరికోరి సెలెక్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా కెరీర్లోకి ముందుకు వెళ్తున్నాడు చైతూ.

Also Read : Aadi Saikumar : సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌ సినిమాతో రాబోతున్న ఆది సాయికుమార్..

ప్రస్తుతం చైతూ నాని హిట్ 3 సినిమాలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. డైరెక్టర్ పవన్ సాధినేనితో ఓ సినిమా, ఈటీవి విన్ ఓటీటీలో ఓ ప్రాజెక్టు చేస్తున్నాడు. ఇవి కాకుండా నటుడిగా ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రచయితగా, హీరోగా MM2 స్టార్ట్ చేయబోతున్నాడు చైతూ జొన్నలగడ్డ. అటు సిద్ధూ హీరోగా ఎదుగుతుంటే ఇటు చైతూ నటుడిగా, రచయితగా దూసుకెళ్తున్నాడు.