Manmadha : సూపర్ హిట్ ‘మన్మధ’ సినిమా 20 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా..?
20 ఏళ్ళ తర్వాత మన్మధ సినిమా తెలుగులో రీ రిలీజ్ కాబోతుంది.

Simbu Jyothika Manmadha Movie Re Release after 20 Years Details Here
Manmadha : శింబు, జ్యోతిక జంటగా తమిళ్ లో 2004 లో తెరకెక్కిన మన్మధన్ సినిమా తెలుగులో మన్మధ పేరుతో రిలీజయింది. తమిళ్, తెలుగులో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడంటే అందరూ RX100, బేబీ సినిమాల గురించి మాట్లాడుతున్నారు కానీ అదే పాయింట్ తో దానికి మించిన కథాంశంతో 20 ఏళ్ళ క్రితమే ఈ సినిమా వచ్చి పెద్ద హిట్ అయింది. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ వింటూనే ఉంటాము. సాంగ్స్ కూడా అంత పెద్ద విజయం సాధించాయి.
20 ఏళ్ళ తర్వాత మన్మధ సినిమా తెలుగులో రీ రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 5న మన్మధ సినిమా రీ రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాని ఇప్పుడు సాయి సుధా రాచకొండ, అజిత్ కుమార్ సింగ్, వేమూరి శ్రేయస్, రమణ రిలీజ్ చేయబోతున్నారు.
ఇక ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే శింబునే కావడం విశేషం. సింధు తులాని, మందిరా బేడి, యానాగుప్త, అతుల్ కులకర్ణి, అర్జు గోవిత్రిక.. పలువురు ముఖ్య పాత్రలు పోషించగా ఏ. జె. మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో శింబు డ్యూయల్ రోల్ లో మెప్పించాడు. ఇప్పుడంటే తెలుగులో ఫాలోయింగ్ ఉన్న తమిళ్ హీరోలు అంటే విజయ్, కార్తీ, సూర్య అని చెప్పుకుంటున్నాము గాని వీళ్లందరికంటే ముందే శింబు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మన్మధ సినిమాతో తెచ్చుకున్నాడు.