Simhadri Re-Release: వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్‌పై సింహాద్రి సెన్సేషన్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ మూవీ రీ-రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ప్రపంచంలోని బిగ్గెస్ట్ లార్జ్ స్క్రీన్ పై రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Simhadri Re-Release: వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్‌పై సింహాద్రి సెన్సేషన్..!

Simhadri Re-Release In World Largest Screen

Updated On : April 24, 2023 / 6:42 PM IST

Simhadri Re-Release: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ‘సింహాద్రి’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో తారక్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డుల మోత మోగించింది.

Simhadri : డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా ‘సింహాద్రి’ రీ రిలీజ్ చేస్తున్న అభిమానులు.. వచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తారో తెలుసా?

అయితే, ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా భారీ స్థాయిలో రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాను ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ పై రీరిలీజ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. మెల్బోర్న్‌లోని ఐమాక్స్‌లో ఈ సినిమాను మే 20న రీ-రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఈ సినిమా రీ-రిలీజ్‌తో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Simhadri Re Release : సింహాద్రి రీ రిలీజ్ అయ్యేది అప్పుడే.. అనౌన్స్‌మెంట్ వీడియో అదిరిపోయింది!

ఇక ఈ సినిమాలో తారక్ సరసన భూమిక, అంకితలు హీరోయిన్లుగా నటించగా, ఎంఎం.కీరవాణి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో తారక్ మరోసారి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు.