Singer Mangli : మంగ్లీ శివరాత్రి పాట వివాదం.. శ్రీకాళహస్తి ఆలయంలో చిత్రీకరణకు ఎలా అనుమతిచ్చారని ఆగ్రహం..
టాలీవుడ్ పాపులర్ సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకుంది. సినిమాల్లో పాటలతో పాటు ఫెస్టివల్ టైంలో కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంటుంది. తాజాగా శివరాత్రి సందర్భంగా 'భం భం భోలే' అనే సాంగ్ ని రిలీజ్ చేసింది. కాగా ఈ సాంగ్ ని శ్రీకాళహస్తి శివుని ఆలయంలో షూట్ చేశారు. అయితే ఆ వీడియో ఇప్పుడు వివాదానికి దారి తీస్తుంది.

Singer Mangli
Singer Mangli : టాలీవుడ్ పాపులర్ సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకుంది. ఫోక్ సింగర్ గా ఫేమ్ సంపాదించుకున్న మంగ్లీ.. టెలివిజన్ రంగంతో కెరీర్ మొదలు పెట్టింది. తెలంగాణ సాంగ్స్ తో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడంతో సినిమా ఛాన్సులు చేర వచ్చాయి. ఇక సినిమాలో ఫోక్ సాంగ్ పడాలి అంటే సంగీత దర్శకుల అందరికి మొదటి ఆప్షన్ మంగ్లీ అయ్యిపోయింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో కూడా ఛాన్సులు అందుకుంటుంది. కాగా సినిమాల్లో పాటలతో పాటు ఫెస్టివల్ టైంలో కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంటుంది.
Singer Mangli Reaction : రాళ్ల దాడిపై స్పందించిన సింగర్ మంగ్లీ.. అసలేం జరిగిందో చెప్పిన గాయని
ఈ క్రమంలోనే బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి, తెలంగాణ ఫార్మషన్ డే, ఉగాది, సమ్మక్క సారక్క జాతర వంటి సందర్భాలకు స్పెషల్ సాంగ్స్ తో ఆడియన్స్ ముందుకు వస్తుంది. తాజాగా శివరాత్రి సందర్భంగా ‘భం భం భోలే’ అనే సాంగ్ ని రిలీజ్ చేసింది. కాగా ఈ సాంగ్ ని శ్రీకాళహస్తి శివుని ఆలయంలో షూట్ చేశారు. అయితే ఆ వీడియో ఇప్పుడు వివాదానికి దారి తీస్తుంది. శ్రీకాళహస్తి టెంపుల్ లో వీడియో తీయడానికి అనుమతి లేదు. అలాంటిది కాలభైరవ స్వామి ఆలయం, అమ్మవారి సన్నిధి నుంచి స్పటిక లింగం వరకు మంగ్లీ అండ్ టీం 10 రోజులు క్రితమే ఈ పాటని చిత్రీకరించారు.
రాయల మండపం, రాహు కేతు మండపం, ఊంజల్ సేవ మండపాల్లో ఈ సాంగ్ మొత్తని చిత్రీకరించారు. శ్రీకాళహస్తి ఆలయంలో చాలా ఏళ్లగా చిత్రీకరణకు నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు గర్భ గుడి వరకు మంగ్లీ అండ్ టీం చిత్రీకరణ చేయడాన్ని శ్రీకాళహస్తి వాసులతో పాటు కొందరు పండితులు కూడా ఖండిస్తున్నారు. అసలు వారికీ ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటూ నిలదీస్తున్నారు. దీని గురించి ఆలయ సిబ్బందిని ప్రశ్నించగా, పర్మిషన్ తోనే చిత్రీకరణ జరిగింది అని తెలియజేస్తున్నప్పటికీ, అనుమతి ఎవరు ఇచ్చారు అనేది మాత్రం తెలియజేయడం లేదు.