SJ Suryah – Sivaji Raja : ఆయన చేత్తో చెంప దెబ్బ కొట్టించుకున్న SJ సూర్య.. దవడ పగిలింది.. పాపం కరాటేలో బ్రౌన్ బెల్ట్ అని తెలియక..
సరిపోదా శనివారం సక్సెస్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్లో SJ సూర్య మాట్లాడుతూ షూటింగ్ లో జరిగిన ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

SJ Suryah Revealed Interesting Scene with Sivaji Raja which Happened in Saripodaa Sanivaaram Movie Shooting
SJ Suryah – Sivaji Raja : డైరెక్టర్ SJ సూర్య ప్రస్తుతం నటుడిగా మారి వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలోనే బెస్ట్ యాక్టర్స్ లో SJ సూర్య ఒకరు. తన పాత్రలో లీనమయిపోయి నటిస్తారు. ఇప్పటికే నటుడిగా అనేక పాత్రల్లో మెపించిన SJ సూర్య ఇటీవల నాని సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా నటించి అదరగొట్టాడు. సినిమా చూసిన తర్వాత అందరూ SJ సూర్య నటన గురించే మాట్లాడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే SJ సూర్య నాని ని కూడా డామినేట్ చేసాడు. నానినే ఈ విషయం స్వయంగా ఒప్పుకున్నాడు.
తాజాగా సరిపోదా శనివారం సక్సెస్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్లో SJ సూర్య మాట్లాడుతూ షూటింగ్ లో జరిగిన ఆసక్తికర విషయాన్ని తెలిపారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు శివాజీ రాజా కూడా నటించారు. క్లైమాక్స్ లో శివాజీ రాజా చేతిలో SJ సూర్య చెంపదెబ్బ తినే సీన్ ఉంటుంది.
Also Read : Nani – Vivek Athreya : ముచ్చటగా మూడోసారి.. స్టేజిపై వివేక్ ఆత్రేయకు మళ్ళీ సినిమా ఆఫర్ ఇచ్చిన నాని..
ఆ సీన్ గురించి SJ సూర్య మాట్లాడుతూ.. ఈ సినిమాలో శివాజీ రాజా గారి చేతిలో చెంప దెబ్బ తినే సీన్ ఉంటుంది. ముందు మామూలుగానే ఊరికే కొట్టినట్టు కనిపించేలా తీశారు. కానీ సరిగ్గా రాలేదని డైరెక్టర్ వివేక్ గారు వచ్చి నిజంగా దెబ్బలు తినగలరా అని అడిగారు, నేను ఓకే అన్నాను. శివాజీ రాజా గారిని నేనే పిలిచి గట్టిగానే కొట్టండి సర్ పర్లేదు నేను తీసుకుంటాను అన్నాను. అయన ఒక్క కొట్టుడు కొట్టారు, దవడకు గట్టిగా తగిలింది. నేను తేరుకోవడానికి కొంచెం సమయం పట్టింది, అంత గట్టి దెబ్బ కొట్టారు. నేను ఒకసారి చెయ్యి చూపించండి అని శివాజీరాజా గారిని అడిగితే నేను కరాటేలో బ్రౌన్ బెల్ట్ అన్నారు. ఇది ముందే చెప్పొచ్చు కదా సర్ అని అడిగాను. మళ్ళీ రీ టేక్ తీసుకొని ఇంకోసారి కూడా కొట్టించుకున్నాను. నాకు ఈ పాత్ర అంత నచ్చి, మీకు నా బెస్ట్ ఇవ్వడానికి నిజంగా కొట్టించుకున్నాను. సినిమాలో ఇంకా కొన్ని సీన్స్ లో కూడా నిజంగా కొట్టించుకున్నాను అని తెలిపారు. దీంతో సినిమాపై తనకున్న డెడికేషన్ ఎలాంటిదో మరోసారి చూపించారు SJ సూర్య. అందుకే ఆయన అంత గొప్ప నటుడు అయ్యారు.
I did my own stunts and took slap from #SivajiRao garu too, (who has brown belt in Karate) just to get your love
– #SJSuryah at #SaripodhaaSanivaaram Vijaya Veduka
pic.twitter.com/wKUNwrQTBz— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) September 5, 2024