Sonu Sood: సోనూసూద్ తండూరి రోటీ.. తింటే మర్చిపోలేరు!

Sonu Sood: సోనూసూద్ తండూరి రోటీ.. తింటే మర్చిపోలేరు!

Sonusood

Updated On : July 26, 2021 / 11:05 PM IST

Sonu Sood: ఈ కరోనా కష్టకాలంలో ఎందరినో ఎన్నో రకాలుగా ఆదుకుని ‘రియల్ హీరో’ అనిపించుకున్న సోనూ సూద్ ఇప్పటికీ తన దానాలు, దాతృత్వాన్ని కొనసాగిస్తున్నారు. కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్లుతో పాటు సోషల్ మీడియా ద్వారా అడిగినవాళ్లకి అడిగినట్లుగా తనకు తోచిన సాయాన్ని అందిస్తున్నారు. కాగా.. ఇప్పుడు కొత్తగా పలు వ్యాపారాలు కూడా మొదలు పెట్టాడు. అయితే, ఇవి తన సొంత లాభం కోసం కాదు.

ఆ మధ్య సోనూ సూద్ సూపర్ మార్కెట్ ఒకటి ఓపెన్ చేసి… వాటి రేట్లు చెప్తూ గుడ్లు, బ్రెడ్ వంటివి అమ్మడు. దానికి సోనూసూద్ సూపర్ మార్కెట్ అని పేరు కూడా పెట్టి డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది.. దానికి ఎక్స్‌ట్రా ఛార్జ్ అవుతుంది.. త్వరగా ఆర్డర్ చెయ్యండి అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. కాగా తాజాగా పంజాబీ ధాబా కూడా ఓపెన్ చేసి అందులో స్వయంగా రోటీలు చేసి అమ్ముతున్నాడు.

సోనూ చేసిన రోటీలు తింటే మర్చిపోలేరని.. ఒకసారి తింటే మళ్ళీ ఇంకెక్కడా తినలేరని కూడా చెప్తూ ఆ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. అయితే.. ఇదంతా తన లాభం కోసం కాదు. చిరు వ్యాపారులను ప్రమోట్ చేసే పనిలో భాగంగా సోనూసూద్ ఇలా వారికి ఫ్రీగా ప్రచారం చేస్తున్నాడు. “Roti Dal free of cost ❤️ Sonu Sood da Punjabi dhaba ?? #supportsmallbusiness #support” అని క్యాషన్ పెట్టిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తుంది. చిరు వ్యాపారుల ప్రోత్సహించడంలో సోను చేపట్టిన ఈ కార్యక్రమానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)