ఎంపీ రామ్మోహన్ నాయుడుని లంచ్‌కి ఆహ్వానించిన సోనూసూద్

ఎంపీ రామ్మోహన్ నాయుడుని లంచ్‌కి ఆహ్వానించిన సోనూసూద్

Sonusood Invites Rammohan Naidu For Lunch Meet

Updated On : May 11, 2021 / 8:53 PM IST

కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు.. అవసరమైనవారికి ఆప్తుడుగా ఆదుకుంటున్న సోనూసూద్‌ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న సోనూసూద్‌ను ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు.

లాల్ ప్రసాద్ దకోజీ(Lal prasad Dakoji) సోనూసూద్ సేవలను కొనియాడుతూ వేసిన చిత్రాన్ని ట్వీట్ చేసిన రామ్మోహన్ నాయుడు.. “సోనుసూద్.. మీ సేవతో మహమ్మారి తీవ్రరూపం దాల్చిన సమయంలో మీ నిస్వార్థమైన పనులతో చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. వేలాది మందికి సహాయం చేస్తున్నారు. శ్రీకాకుళానికి చెందిన లాల్ ప్రసాద్ దకోజీ కూడా మీ సేవలను ఆరాధిస్తున్నాడు. ఈ అందమైన పెయింటింగ్‌ మీకోసం వేశారు. ఈ పెయింటింగ్‌ను షేర్ చెయ్యడానికి సంతోషిస్తున్నాను.” అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌పై స్పందించిన సోనూసూద్.. లాల్ ప్రసాద్ దకోజీని అభినందించారు. లాల్ ప్రసాద్‌ని పర్సనల్‌గా కలవాలని ఎదురుచూస్తున్నాను. మనందరం కలిసి లంచ్ ప్లాన్ చేద్దాం.. అంటూ రామ్మోహన్ నాయుడుని లంచ్‌కి ఆహ్వానించారు సోనూసూద్. ఇండియా ఫ్లాగ్‌ను తన ట్వీట్‌కి జత చేశారు.