బాలు హెల్త్ అప్‌డేట్.. ఫిజియోథెరపీ కొనసాగుతోంది..

  • Published By: sekhar ,Published On : August 28, 2020 / 08:17 PM IST
బాలు హెల్త్ అప్‌డేట్.. ఫిజియోథెరపీ కొనసాగుతోంది..

Updated On : August 29, 2020 / 8:10 PM IST

SPB Health Condition: ప్రపంచవ్యాప్తంగా గాన గంధర్వుడు ఎస్.పి. బాలు కోసం చేసిన పూజలు ఫలించాయి. ప్రస్తుతం బాలు కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎంజీఎం హాస్పిటల్ వారు తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

‘‘ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన స్పృహలో ఉన్నారు..వైద్యానికి బాగా స్పందిస్తున్నారు.. ప్రస్తుతం ఆయనకు ఫిజియోథెరపీ కొనసాగుతోంది…ఐసీయూలో వెంటిలేటర్ పై ఎక్మో ద్వారా ఆయనకు చికిత్స అందిస్తున్నాము..వివిధ వైద్య స్పెషాలిటీ నిపుణులైన వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు’’.. అని ఎంజీఎం హాస్పిటల్ వారు తెలిపారు.