‘నాని’ జెర్సీ సెకండ్ సాంగ్ రిలీజ్ 

  • Published By: madhu ,Published On : March 8, 2019 / 03:44 AM IST
‘నాని’ జెర్సీ సెకండ్ సాంగ్ రిలీజ్ 

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్‌గా పేరొందిన ‘నాని’ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘జెర్సీ’. షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఈ మూవీ వస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సినిమా నిర్మిస్తున్నారు. నాని సరసన శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే చిత్రానికి సంబంధించిన సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా మరో గీతాన్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నాని అభిమానులను ఈ సాంగ్ అలరిస్తోంది. 

అణిగిమణగిన అలలిక ఎగసెను చూడరా..అసలు అవధులు లేవురా.అలుపు దరికి చేరనీయక ఆడరా అంటూ సాంగ్ సాగింది. దీనిని కె.కె రచించగా కాళ భైరవ పాడారు. ‘జెర్సీ’ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపించబోతున్నాడు. తన లక్ష్యాన్ని ఎలా అధిగమించాడు..ఈ సమయంలో వచ్చిన ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేసుకున్నాడో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు టాక్. రంజీట్రోఫి క్రికెట్ నేపథ్యంలో కథ సాగనుంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏప్రిల్ 19న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.