Squid Game: “స్క్విడ్ గేమ్ 2” ఒక్కొక ఎపిసోడ్‌కి ఆ నటుడు అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?

అవార్డ్ విన్నింగ్ షో "స్క్విడ్ గేమ్" రెండవ సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమయిన ఈ వెబ్ సిరీస్ ప్రపంచ ప్రజాధారణ పొంది బెస్ట్ సిరీస్ గా నిలిచింది. ఇక ఈ సిరీస్ సీజన్ 2 వరల్డ్ వైడ్ గా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దిశలో ఉన్న ఈ షో గురించి ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ బయటకు వచ్చింది.

Squid Game: “స్క్విడ్ గేమ్ 2” ఒక్కొక ఎపిసోడ్‌కి ఆ నటుడు అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?

Squid Game Actor Lee Jung-Jae Charging Huge Amount per Episode

Updated On : October 12, 2022 / 2:31 PM IST

Squid Game: అవార్డ్ విన్నింగ్ షో “స్క్విడ్ గేమ్” రెండవ సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమయిన ఈ వెబ్ సిరీస్ ప్రపంచ ప్రజాధారణ పొంది బెస్ట్ సిరీస్ గా నిలిచింది. ఇక ఈ సిరీస్ సీజన్ 2 వరల్డ్ వైడ్ గా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దిశలో ఉన్న ఈ షో గురించి ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ బయటకు వచ్చింది.

Sacred Games Actor Elnaaz Norouzi: బట్టలు విప్పేసిన హీరోయిన్.. మా బట్టలు మా ఇష్టం అంటూ..

మొదటి సీజన్ లో నటించిన “లీ జుంగ్ జె” తన నటనకు గాను డ్రామా సిరీస్ విభాగంలో ప్రధాన నటుడిగా ”ఎమ్మీ’ అవార్డుని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన మొదటి ఆసియా నటుడు లీ. దీంతో ఈ యాక్టర్ సెకండ్ సీజన్ కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కొరియన్ మీడియా నివేదికల ప్రకారం, జంగ్ జే ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు 5.7 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. లీ జంగ్ జేతో పాటు దర్శకుడు హ్వాంగ్ డాంగ్ హ్యూక్‌కు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. రూ. 70 మిలియన్లు భారీ బడ్జెక్టుతో తెరకెక్కుతున్న ఈ సిరీస్ వచ్చే ఏడాది మొదటి భాగంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.