శ్రీవిష్ణు కొత్త సినిమా ప్రారంభం..

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

  • Published By: sekhar ,Published On : December 6, 2019 / 09:46 AM IST
శ్రీవిష్ణు కొత్త సినిమా ప్రారంభం..

Updated On : December 6, 2019 / 9:46 AM IST

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. హాసిత్ గోలి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Image

టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వినోదం, డ్రామా కలగలిపిన ఈ చిత్రం వైవిధ్యంగా సాగుతుందని చిత్ర దర్శకుడు హాసిత్ గోలి తెలిపారు. శ్రీవిష్ణు, హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగిన యువకులతో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాతలు చెప్పారు.

Image

ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నెలలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంగీతం: వివేకసాగర్, ఛాయాగ్రహణం: వేదరామన్, సహ నిర్మాతలు: వివేక్ కూచి భొట్ల, కీర్తి చౌదరి.