Sreeleela : లిప్‌కిస్ పై శ్రీలీల స్టేట్మెంట్.. అబద్దం చెప్పి దొరికిపోయిందిగా..

తాజాగా ఇచ్చిన ప్రింట్ మీడియా ఇంటర్వ్యూలో సీన్స్ డిమాండ్ చేస్తే లిప్ కిస్ ఇస్తారా అని అడగ్గా.. శ్రీలీల సమాధానమిస్తూ..

Sreeleela : లిప్‌కిస్ పై శ్రీలీల స్టేట్మెంట్.. అబద్దం చెప్పి దొరికిపోయిందిగా..

Sreeleela comments on Lip Kiss goes viral Netizens trolls

Updated On : October 28, 2023 / 10:18 AM IST

Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్(Tollywood) లో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీల(Sreeleela). వరుస హిట్స్ తో, వరుస సినిమాలతో దూసుకుపోతుంది శ్రీలీల. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాలో కూతురి పాత్రలో కూడా చేసి మెప్పించింది. త్వరలో ఆదికేశవ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఇటీవలే ఓ మాస్ సాంగ్ రిలీజ్ చేయగా అందులో శ్రీలీల తన మాస్ డ్యాన్స్ తో అదరగొట్టేసింది. మొత్తానికి టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ విన్నా శ్రీలీల పేరే వినిపిస్తుంది.

అయితే తాజాగా ఇచ్చిన ప్రింట్ మీడియా ఇంటర్వ్యూలో సీన్స్ డిమాండ్ చేస్తే లిప్ కిస్ ఇస్తారా అని అడగ్గా.. శ్రీలీల సమాధానమిస్తూ.. నేను లిప్ కిస్ సీన్స్ చేయను. ఏ హీరోతోనూ చేయను. నేను లిప్ కిస్ ఇస్తే అది మొదటిసారిగా నా భర్తకే ఇస్తాను అని చెప్పింది. ఇటీవల శ్రీలీల చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే పలువురు నెటిజన్లు మొదట్లో ఇలానే అంటారు, ఆ తర్వాత స్క్రిప్ట్ డిమాండ్ చేసిందని, సీన్ డిమాండ్ చేసిందని, రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకొని చేస్తారు. గతంలో చాలా మంది కూడా ఇలాగే చెప్పి లిప్ కిస్ సీన్స్ చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Bigg Boss 7 Day 54 : ఈ వారం కొత్త కెప్టెన్ ఎవరు? మిర్చి దండలతో కెప్టెన్ ఎన్నిక..

అయితే శ్రీలీల మొదటి సినిమా కన్నడ లో ‘కిస్’. ఈ సినిమా తెలుగులో ‘ఐ లవ్ యు ఇడియట్’ అనే టైటిల్ తో రిలీజయింది. ఈ సినిమాలో హీరోకి శ్రీలీల ఒక సాంగ్ లో లిప్ కిస్ ఇస్తుంది. అయితే ఇది ఎక్కువసేపు ఉండకపోయినా ఇప్పుడు ఈ లిప్ కిస్ వైరల్ అవుతుంది. లిప్ కిస్ ఎవ్వరికి ఇవ్వను అని చెప్పి మొదటి సినిమాలోనే లిప్ కిస్ ఇచ్చింది శ్రీలీల అని లిప్ కిస్ వీడియోని షేర్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అబద్దం చెప్పి దొరికిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది శ్రీలీల ఫ్యాన్స్ అయితే అది లిప్ కిస్ కాదు, జస్ట్ ఇంటిమసీ కోసం లిప్స్ కి టచ్ చేసింది అని శ్రీలీలని సపోర్ట్ చేస్తున్నారు. ఎలా అయిన ట్రెండింగ్ ఉండే శ్రీలీల తాజాగా తన లిప్ కిస్ స్టేట్మెంట్ తో ట్రెండింగ్ లో ఉంది.