Sreeleela : హీరోయిన్స్‌కి చెక్ పెడుతున్న శ్రీలీల.. టాలీవుడ్‌ని ఏలేస్తుందిగా..

టాలీవుడ్(Tollywood) హీరోల్ని తన వైపుకు తిప్పేసుకుని వరసగా సినిమా చాన్సులు కొట్టేస్తోంది శ్రీలీల. అండర్ రేటెడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అసలు ఇండియాలోనే ఏ హీరోయిన్ కి లేనన్ని ఆఫర్లతో రికార్డ్ సెట్ చేస్తోంది శ్రీలీల.

Sreeleela : హీరోయిన్స్‌కి చెక్ పెడుతున్న శ్రీలీల.. టాలీవుడ్‌ని ఏలేస్తుందిగా..

Sreeleela getting continuous offers replacing even star heroins movies

Updated On : July 15, 2023 / 1:10 PM IST

Sreeleela :  భీష్మ(Bheeshma) సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నితిన్(Nithin), రష్మిక(Rashmika), వెంకీ కుడుముల(Venky Kudumula) ఇటీవల మరో సినిమా స్టార్ట్ చేశారు. అయితే కొన్ని ఇష్యూస్ తో రష్మిక సినిమా పైనుంచి తప్పుకోగా ఆ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చిందని తెలుస్తోంది. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత కూడా ఫ్లాపుల్లో ఉన్న నితిన్ తో సినిమాకి ఓకే చెప్పి సినిమాకి మెయిన్ ఎసెట్ అయిన రష్మిక సినిమా నుంచి తప్పుకొని శ్రీలీలని రీప్లేస్ చెయ్యడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.

టాలీవుడ్(Tollywood) హీరోల్ని తన వైపుకు తిప్పేసుకుని వరసగా సినిమా చాన్సులు కొట్టేస్తోంది శ్రీలీల. అండర్ రేటెడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అసలు ఇండియాలోనే ఏ హీరోయిన్ కి లేనన్ని ఆఫర్లతో రికార్డ్ సెట్ చేస్తోంది శ్రీలీల. ఆల్రెడీ 10 సినిమాలు చేస్తున్న శ్రీలీల లేటెస్ట్ గా నితిన్ సినిమాకి ఓకే చేసింది. శ్రీలీల రష్మిక సినిమానే కాదు ప్రజెంట్ తెలుగులో ఉన్న స్టార్ హీరోయిన్ల ఆఫర్లన్నిటినీ కొట్టేస్తోందని టాక్ నడుస్తోంది. చిన్నా పెద్ద తేడాలేకుండా, లాంగ్వేజ్ తో సంబందం లేకుండా వరసపెట్టి సినిమాలు చేస్తున్న ఈ హ్యాపెనింగ్ హీరోయిన్ వేరే హీరోయిన్ల కెరీర్ కి చెక్ పెడుతోందా అని అనుకుంటున్నారు.

ప్రజెంట్ తెలుగులో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ శ్రీలీల. స్టార్ హీరోయిన్ కి కూడా లేనన్ని ఆఫర్లతో యమా బిజీ అయిపోయిన శ్రీలీల టాలీవుడ్ లోనే 8 సినిమాలు చేస్తోంది. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్, బాలకృష్ణ, వైష్ణవ తేజ్, నవీన్ పోలిశెట్టి, నితిన్.. ఇలా అందరి సినిమాల్లో తనే హీరోయిన్ గా ఉంది. రోజు రోజుకి ఈ అమ్మడికి ఆఫర్లు పెరుగుతూనే ఉన్నాయి.

రష్మిక హీరోయిన్ గా ఉన్న సినిమానే కాదు అంతకుముందు పూజాహెగ్డే సినిమాల్ని కూడా శ్రీలీల రీప్లేస్ చేసిందని టాక్. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజాహెగ్డే హీరోయిన్ అనుకున్నారు. కానీ పూజా ప్లేస్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. ఈ సినిమాతో పాటు మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారంలో కూడా ఫస్ట్ నుంచి పూజాహెగ్డేనే హీరోయిన్ అని, శ్రీలీల సెకండ్ హీరోయిన్ అని అన్నారు. కానీ పూజాని పక్కన పెట్టి శ్రీలీల మెయిన్ లీడ్ అయ్యిందని టాక్ నడుస్తుంది. ఇలా శ్రీలీల పూజా హెగ్డే, రష్మిక లాంటి స్టార్ హీరోయిన్లకే చెక్ పెట్టేసిందని, శ్రీలీల దెబ్బకి అందరూ అవుట్ అని టాక్ నడుస్తోంది.

 

Sai Dharam Tej : వివాదంలో సాయిధరమ్ తేజ్.. శ్రీకాళహస్తి గుడిలో స్వయంగా హారతి..

శ్రీలీల అందరి ఆఫర్లూ తన్నుకుపోతోందని, చిన్న హీరోలతో బిజీ అవుతున్న కృతి శెట్టికి కూడా చెక్ పెట్టేసిందని కొంతమంది అనుకుంటున్నారు. ఈ మద్య కాలంలో ఇంత టాలెంట్ ఉన్న హీరోయిన్ ని చూడలేదని మరికొంతమంది పొగుడుతున్నారు. స్పెషల్లీ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు హీరోయిన్ మళ్లీ ఇన్నాళ్లకి సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతోందనంటున్నారు. ఒకప్పుడు రాఘవేంద్రరావు ఇంట్రడ్యూస్ చేసిన శ్రీదేవి లాంటి హీరోయిన్లు టాప్ హీరోయిన్లుగా ఫేమస్ అయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకి రాఘవేంద్రరావు హీరోయిన్ గా శ్రీలీల ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ అయిపోయిందంటూ ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు.