Sreeleela : శివకార్తికేయన్‌తో కలిసి కుర్చీ మడతబెట్టేసిన శ్రీలీల.. మహేష్ పాటకు తమిళనాడులో మాస్ స్టెప్పులు..
తాజాగా కుర్చీ మడతబెట్టి సాంగ్ కి శ్రీలీల, తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కలిసి స్టేజిపై స్టెప్పులు వేయడంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి.

Sreeleela Siva Karthikeyan Mass Steps for Guntur Kaaram Kurchi Madathabetti Song on Stage Videos goes Viral
Sreeleela : మహేష్ బాబు(Mahesh Babu), శ్రీలీల జంటగా సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో తెలిసిందే. దాదాపు 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి భారీ విజయం సాధించింది. ఇక ఈ సినిమా ఎంత హిట్ అయిందో అంతకంటే ముందు పాటలు బాగా హిట్ అయ్యాయి. గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ అయితే బాగా వైరల్ అయింది.
కుర్చీ మడతబెట్టి.. అనే ఓ వైరల్ వర్డ్ తీసుకొని దాంతో స్పెషల్ సాంగ్ రాయగా థమన్ ఇచ్చిన ఫాస్ట్ మ్యూజిక్ బీట్స్, శ్రీలీల, మహేష్ సినిమాలో వేసిన స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లాయి. థియేటర్స్ లో మహేష్, శ్రీలీల మాస్ స్టెప్పులు చూసి అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆ స్టెప్పులు కూడా వైరల్ అవ్వడంతో బయట, ఈవెంట్స్ లో, కాలేజీ ఫంక్షన్స్ లో, రీల్స్ లో ఎక్కడ చూసినా కుర్చీ మడతబెట్టి స్టెప్పులు సందడి చేసాయి.
Also Read : Guntur Kaaram : ‘గుంటూరు కారం’ టీవీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడో తెలుసా?
తాజాగా కుర్చీ మడతబెట్టి సాంగ్ కి శ్రీలీల, తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthiekyan) కలిసి స్టేజిపై స్టెప్పులు వేయడంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి. తమిళనాడు తిరుచిరప్పల్లికి దగ్గర్లోని ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీలో జరిగే అనంతర కల్చరల్ ఫెస్ట్ కి ఆదివారం మార్చ్ 23 రాత్రి శివకార్తికేయన్, శ్రీలీల హాజరయ్యారు. ఈ ఈవెంట్లో శ్రీలీల, శివకార్తికేయన్ కలిసి స్టేజిమీద కుర్చీ మడతబెట్టి సాంగ్ కి స్టెప్పులు వేశారు. అక్కడి స్టూడెంట్స్ కూడా ఫుల్ జోష్ లో ఈ సాంగ్ కి డ్యాన్స్ వేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. ఇక శ్రీలీల, శివకార్తికేయన్ రావడంతో అక్కడి స్టూడెంట్స్ ఫోటోల కోసం ఎగబడ్డారు. స్టేజిపై శ్రీలీల, శివకార్తికేయన్, యాంకర్స్ కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నారు.
Tamil Actor @Siva_Kartikeyan Grooves To The Addictive #KurchiMadathapetti Song ??
God Level Reach ?????#GunturKaaram || @urstrulyMahesh pic.twitter.com/KZckRBvEvF
— Pandu Gadu ™ (@PG_4005) March 23, 2024
Kollywood Prince @Siva_Kartikeyan danced to Our superstar @urstrulymahesh's #KurchiMadathapetti along with @sreeleela14
#MaheshBabu #GunturKaarampic.twitter.com/3PtaNtvZYR
— Burri Palem MBFC™ (@BurriPalemMbfc) March 24, 2024