ఆ నవ్వులో ఇంకా బతికే ఉన్నావు

  • Published By: venkaiahnaidu ,Published On : February 24, 2019 / 12:51 PM IST
ఆ నవ్వులో  ఇంకా బతికే ఉన్నావు

Updated On : February 24, 2019 / 12:51 PM IST

అతిలోకసుందరి శ్రీదేవి మరణించి నేటికి ఏడాది పూర్తి అయింది. గతేడాది ఫిబ్రవరి-24న దుబాయ్ లోని ఓ హోటల్ లో ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో మునిగి ఆమె చనిపోయిన విషయం తెలిసిందే. శ్రీదేవి తొలి వర్థంతి సందర్భంగా కూతురు జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు. జన్వీ చేసిన ఆ పోస్ట్ లో..నా హృదయం ఎప్పుడూ భారంగానే ఉంటుంది.కానీ నేను నవ్వుతూనే ఉంటాను.ఎందుకంటే ఆ నవ్వులోనే నువ్వున్నావ్ అని రాసింది. తన తల్లి చేతిని పట్టుకున్న ఫొటోను అభిమానులతో జాన్వీ పంచుకున్నారు.

పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శ్రీదేవిని ఈ సందర్భంగా స్మరించుకుంటున్నారు. ఇప్పటికీ శ్రదేవి లేరన్న నిజాన్ని నమ్మలేకపోతున్నామంటూ కొందరు ఆమెతో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకున్నారు. భారతీయ సినీ చరిత్రలో శ్రీదేవి ఎప్పటికీ నిలిచిపోతారని, ఆమె మన మధ్య లేకున్నా సినిమాల రూపంలో ఆమె మన మధ్య ఎప్పుడూ ఉంటారని పలువురు సోషల్ మీడియా వేదికగా శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ పోస్ట్ లు పెట్టారు. శ్రీదేవి హఠాన్మరణం ఆమె కుటుంబాన్నే కాకుండా యావత్ సినీ పరిశ్రమను శోకసంద్రంలోకి నెట్టింది. గతేడాది జూన్-2న తమ పెళ్లిరోజు సందర్భంగా శ్రీదేవి చివరిసారిగా ఆనందంగా గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియోను బోనీకపూర్ ట్విట్టర్ లో  పోస్ట్ చేశారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.