Unstoppable With NBK: రాజమౌళి.. ఆ బ్లాక్‌బస్టర్ కథను బాలయ్యకే చెప్పారట!

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తూ 'ఆహా' ఒటీటీలో ప్రదర్శితం అవుతోన్న టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'.

Unstoppable With NBK: రాజమౌళి.. ఆ బ్లాక్‌బస్టర్ కథను బాలయ్యకే చెప్పారట!

Ss Rajamouli (1)

Updated On : December 19, 2021 / 6:28 AM IST

Unstoppable With NBK: నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తూ ‘ఆహా’ ఒటీటీలో ప్రదర్శితం అవుతోన్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'(Unstoppable With NBK). ఈ షో కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. బాలయ్య తన ఎనర్జీతో.. వచ్చే కంటెస్టెంట్‌లను వేసే ప్రశ్నలతో ఆకట్టుకుంటున్నారు. లేటెస్ట్‌గా ఈ షోకి దర్శకధీరుడు రాజమౌళి గెస్ట్‌గా వచ్చారు. ఆయనతో పాటు.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా మరో గెస్ట్‌గా వచ్చారు.

ఈ సంధర్భంగా ముగ్గురి మధ్య కన్వర్జేషన్ ఆసక్తికరంగా సాగింది. ‘‘ఇప్పటివరకూ మన కాంబినేషన్‌ పడలేదు. నా అభిమానులు మిమ్మల్ని ‘బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తారు’ అని అడిగారు. మీ సమాధానం ఏంటి’’ అని రాజమౌళిని ప్రశ్నించారు బాలయ్య.

బాలయ్య ప్రశ్నకు సమాధానంగా.. సినిమా తీసే సమయంలో తాను హీరో కష్టసుఖాల గురించి ఆలోచించనని, షాట్‌ పెట్టుకున్నాక.. హీరో ఎండలో నిలబడ్డాడా? వానలో నిలబడ్డాడా? అన్నది చూడను అని, అందువల్ల బాలయ్య గారితో సినిమా చేసేప్పుడే తన వ్యవహారశైలి వల్ల బాలకృష్ణకు ఏమైనా కోపం వస్తుందేమో అనే భయంతోనే సినిమా చేయడానికి ముందుకు రాలేదని చెప్పారు.

రాజమౌళి ఈ మాట చెప్పగానే బోయపాటి కూడా అంతే అంటూ.. ‌నేను కూడా ఒకసారి క్యారావ్యాన్‌లో నుంచి బయటకొస్తే, ఆ రోజు షూటింగ్‌ అయ్యేవరకూ లోపలకి వెళ్లను.. గొడుగు పట్టనివ్వను’’ అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో మీరు నాకు ఒక కథ చెప్పారు కదా? అని అనగానే ‘ఛత్రపతి’ సినిమా సమయంలో ‘మగధీర’ కథ చెప్పాను’’ అని రాజమౌళి చెప్పారు. ఆ సినిమాని రామ్‌చరణ్‌తో చేసినట్లు వెల్లడించారు.