Leo Movie : క్యాప్షన్స్తో సినిమా కథని చెప్పేస్తున్న ‘లియో’..
తమిళ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లియో మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ తో చిత్ర యూనిట్ సినిమా కథని చెప్పేస్తున్నారు.

story telling captions in Vijay Leo Movie recent release posters
Leo Movie : విజయ్ (Vijay), లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ మూవీ ‘లియో’. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘మాస్టర్’ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు లియో పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ వరుసగా పోస్టర్లు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ ఈ పోస్టర్స్ తో మేకర్స్ సినిమా కథ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు పలు టైటిల్ పోస్టర్లని రిలీజ్ చేయగా.. వాటిలో డిఫరెంట్ క్యాప్షన్స్ తో డిజైన్ చేశారు.
Bedurulanka 2012 : ఓటీటీకి వచ్చేసిన బెదురులంక 2012.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
ఇక ఆ క్యాప్షన్స్ తోనే సినిమా కథ ఏంటో చెప్పేస్తున్నారు మేకర్స్. ‘ప్రశాంతంగా ఉండి యుద్దాన్ని నిరాకరించు’, ‘ప్రశాంతంగా ఉండి ఎస్కేప్ను ప్లాన్ ప్లాన్ చెయ్యి’, ‘ప్రశాంతంగా ఉంటూ యుద్దానికి సిద్ధం అవ్వు’, ప్రశాంతంగా ఉంటూ విలన్ ని ఎదుర్కో’.. అంటూ సినిమా కథని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్యాప్షన్స్ బట్టి చూస్తే.. హీరో మొదట అజ్ఞాతంలో ఉంటాడని, యుద్దానికి సిద్దమయిన తరువాత విలన్ తో ఫైట్ చేస్తాడని తెలుస్తుంది. మరి ఈ కథని లోకేష్ తనదైన స్క్రీన్ ప్లేతో ఎలా చెబుతాడో చూడాలి.
Manchu Lakshmi : ప్రధాని మోడీ ఆఫీస్ నుంచి మంచు లక్ష్మికి పిలుపు.. ఎందుకో తెలుసా..?
KEEP CALM AND AVOID THE BATTLE
KEEP CALM AND PLOT YOUR ESCAPE
KEEP CALM AND PREPARE FOR BATTLE
KEEP CALM AND FACE THE DEVIL pic.twitter.com/ySi8UnAcOe— Manobala Vijayabalan (@ManobalaV) September 21, 2023
కాగా ఈ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ఇటీవల UK లో బుకింగ్లను ఓపెన్ చేయగా రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోయాయి. త్రిష ఈ సినిమాలో విజయ్ కి జోడిగా కనిపించబోతుంది. అర్జున్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మిస్కిన్, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.