Sukumar : రంగస్థలం సినిమాలో అనుపమని హీరోయిన్ గా అనుకున్నాం.. కానీ..
తాజాగా సోమవారం నాడు 18 పేజెస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి సుకుమార్, అల్లు అర్జున్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ అనుపమ పరమేశ్వరన్ గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

Sukumar reveals anupama is the first choice for rangasthalam movie
Sukumar : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 18 పేజెస్ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే నిఖిల్, అనుపమ కలిసి నటించిన కార్తికేయ 2 సినిమా భారీ విజయం సాధించాక రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
తాజాగా సోమవారం నాడు 18 పేజెస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి సుకుమార్, అల్లు అర్జున్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ అనుపమ పరమేశ్వరన్ గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
18 Pages : ’18 పేజిస్’ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..
సుకుమార్ మాట్లాడుతూ.. రంగస్థలం సినిమాకి ముందు అనుపమ పరమేశ్వరన్ నే హీరోయిన్ గా అనుకున్నాం. ఆడిషన్ కి పిలిస్తే వచ్చింది. ఆడిషన్ లో భయం భయంగా మధ్యలో వాళ్ళ అమ్మని చూస్తూ ఉంది. తన భయం చూసి నాకు భయం వేసింది. ఆ తర్వాత సమంతని తీసుకున్నాం అని తెలిపాడు. త్వరలోనే అనుపమతో సినిమా తీస్తాను అని కూడా అన్నాడు. దీంతో ఒక మంచి సినిమా మిస్ అయింది అనుపమ అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.