OoruPeru Bhairavakona : సందీప్ కిషన్ ‘ఊరుపేరు భైరవకోన’.. టీవీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు? ఎక్కడ?
ఊరు పేరు భైరవకోన ఇప్పుడు టెలివిజన్ లోకి వస్తుంది.

Sundeep Kishan OoruPeru Bhairavakona Television Telecasting Details
OoruPeru Bhairavakona : VI ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘ఊరుపేరు భైరవకోన’. AK ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 16న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. వైవా హర్ష, వెన్నెల కిషోర్, రవిశంకర్.. పలువురు ముఖ్య పాత్రల్లో థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించి కలెక్షన్స్ కూడా బాగా రాబట్టి సందీప్ కిషన్ కు హిట్ ఇచ్చింది.
ఊరు పేరు భైరవకోన ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా ఇప్పుడు టెలివిజన్ లోకి వస్తుంది. ఊరు పేరు భైరవకోన సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా జూన్ 30, ఆదివారం సాయంత్రం 6:00 గంటలకు జీ తెలుగులో టెలికాస్ట్ అవ్వనుంది. థియేటర్స్ లో మిస్ అయినా వారు ఈ సూపర్ నేచురల్ థ్రిల్లింగ్ సినిమాని టీవీలో చూసేయండి.
Also Read : VD14 : ఈ తూరి సినిమా అంతా మన సీమలోనే.. రాయలసీమ వాళ్లకు విజయ్ దేవరకొండ సినిమాలో నటించే ఛాన్స్..
ఇక ఊరు పేరు భైరవకోన సినిమా కథ విషయానికొస్తే.. సినిమాల్లో డూప్ గా యాక్షన్ సీన్స్ చేసే బసవ(సందీప్ కిషన్) భూమి(వర్ష బొల్లమ్మ) కోసం ఓ పెళ్లి ఇంట్లో బంగారు నగలు కొట్టేసి తప్పించుకొని పారిపోతాడు. బసవతో పాటు జాన్(వైవా హర్ష) తప్పించుకొని వెళ్తుంటే దారిలో గీత(కావ్య థాపర్) అనే దొంగ యాక్సిడెంట్ లాగా నాటకం ఆడటంతో, తనని కాపాడటానికి వీళ్ళ బండి ఎక్కించుకుంటారు. పోలీసులు వీళ్ళని ఛేజ్ చేయడంతో అనుకోకుండా భైరవకోన అనే ఊర్లోకి వెళ్తారు. అక్కడ వీరికి అనుకోని వింత అనుభవాలు ఎదురవ్వడం, తను దొంగతనం చేసిన నగలు అక్కడి వాళ్ళు కొట్టేయడం, ఆ నగలు తెచ్చుకుందాం అనుకునేలోపు అసలు అది ఊరు కాదని, ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళంతా దయ్యాలు అని తెలుస్తుంది. ఉదయం అవ్వడంతో ఆ దయ్యాలన్నీ మళ్ళీ గాలిలో కలిసి ఊర్లో ఒక్కరు కూడా కనపడరు. అసలు భైరవ కోన ఏంటి? అక్కడ అన్ని దయ్యాలే ఎందుకున్నాయి? బసవ ఎందుకు దొంగతనం చేస్తున్నాడు? భూమి ఎవరు? నగలు దొరికాయా? వీళ్ళు భైరవకోన నుంచి బయటపడ్డారా అనేది చూడాల్సిందే.
Mark your calendars ✅ The world of Bhairavakona is all set to hit your screens??
Watch World Television Premiere #OoruPeruBhairavakona on June 30th, Sunday at 6 PM on #ZeeTelugu#OoruPeruBhairavakonaOnZeeTelugu #ZeeTeluguPromo @sundeepkishan @Dir_Vi_Anand @VarshaBollamma… pic.twitter.com/5ZKyeLw0jJ
— ZEE TELUGU (@ZeeTVTelugu) June 23, 2024