సూపర్‌స్టార్ మహేష్ @ 41 ఇయర్స్.. ట్రెండింగ్‌లో సీడీపీ..

Superstar Mahesh Babu 41 Years: సూపర్‌స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 41 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. అదేంటి ఆయన హీరోగా చేసింది 26 సినిమాలే కదా.. అప్పుడే 41 ఏళ్లు పూర్తవడమేంటి అనుకుంటున్నారా?..
అవును, నిజమే.. దర్శకరత్న దాసరి నారాయణరావు 1979లో ‘నీడ’ సినిమాతో మహేష్ బాబుని బాలనటుడిగా పరిచయం చేశారు. ఆ సినిమా విడుదలై ఈ ఏడాదితో 41 సంవత్సరాలు పూర్తవుతాయి.
ఎన్టీఆర్-ఏఎన్నార్ తర్వాతి తరంలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ మాత్రమే ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత మహేష్ బాబే అని చెప్పాలి.
సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఎరా స్టార్ అయ్యి 41 సంవత్సరాలు అంటూ.. ఫ్యాన్ స్పెషల్ సీడీపీ రిలీజ్ చేశారు. ఇప్పుడీ సీడీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సీడీపీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంద్రభవనాన్ని తలపించే భవంతి, ఆ తర్వాత మహేష్ సినీ ప్రస్థానాన్ని రీల్‌పై తెలియజేస్తూ, మహేష్ మైనపు విగ్రహాన్ని చూపించారు.
తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా తండ్రి కృష్ణతో, అన్నయ్య రమేష్ బాబుతో కలిసి ‘పోరాటం’, ‘శంఖారావం’ ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘గూడాఛారి 117’,
‘బజారురౌడీ’ వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. బాలనటుడిగా ద్విపాత్రాభినయం కూడా చేశారు. చిన్నతనంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
తర్వాత స్టడీస్ కంప్లీట్ చేసి.. 1999లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఫస్ట్ మూవీతోనే కృష్ణ నటవారసుడిగా గుర్తింపు పొందారు.
‘యువరాజు’, ‘వంశీ’, ‘మురారీ’, ‘టక్కరిదొంగ’, ‘బాబి’, ‘ఒక్కడు’, ‘నిజం’, ‘అర్జున్’, ‘అతడు’, ‘పోకిరి’, ‘సైనికుడు’, ‘అతిథి’, ‘దూకుడు’, ‘బిజినెస్‌మేన్’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’,
‘1-నేనొక్కడినే’, ‘ఆగడు’, ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’, ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాల్లో నటించి తిరుగులేని సూపర్‌స్టార్‌గా స్థిరపడ్డారు.
ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నారు మహేష్.
సినీ పరిశ్రమలో సూపర్ సక్సెస్‌ఫుల్‌గా 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు మహేష్ బాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.