పెళ్ళై 14 ఏళ్ళయ్యింది- ఇప్పుడెందుకవన్నీ?

పాపులర్ డెన్వర్ పర్ఫ్యూమ్‌కి మహేష్, బ్రాండ్ అంబాసిడర్‌గా సెలెక్ట్ అయ్యాడు.

  • Published By: sekhar ,Published On : February 2, 2019 / 08:49 AM IST
పెళ్ళై 14 ఏళ్ళయ్యింది- ఇప్పుడెందుకవన్నీ?

Updated On : February 2, 2019 / 8:49 AM IST

పాపులర్ డెన్వర్ పర్ఫ్యూమ్‌కి మహేష్, బ్రాండ్ అంబాసిడర్‌గా సెలెక్ట్ అయ్యాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాలు, మరోపక్క వివిధ ప్రొడక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్, ఏఎమ్‌బీ సినిమాస్‌, రీసెంట్‌గా ప్రొడ్యూసర్‌గా వెబ్ సిరీస్…. ఇలా బిజీ బిజీగా ఉండే మహేష్ ఖాతాలోకి మరోకొత్త ప్రొడక్ట్ వచ్చి చేరింది. పాపులర్ డెన్వర్ పర్ఫ్యూమ్‌కి మహేష్, బ్రాండ్ అంబాసిడర్‌గా సెలెక్ట్ అయ్యాడు. నేను చూజ్ చేసుకునే బ్రాండ్స్, నా పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలనుకుంటాను అని మహేష్ అన్నాడు.

ఈ ప్రెస్ మీట్‌లో మహేష్ మీడియాతో సరదాగా మాట్లాడాడు. ఫిబ్రవరి వాలెంటైన్ మంథ్, నమ్రత దగ్గరినుండి కాకుండా, మిగతా వారి దగ్గర నుండి వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటని రిపోర్టర్ అడిగగా, మహేష్.. పెళ్ళై 14 ఏళ్ళయ్యింది. ఇప్పుడెందుకవన్నీ అంటూ నవ్వేసాడు. త్వరలో మహేష్ నటించిన డెన్వర్ యాడ్స్ టెలికాస్ట్ కానున్నాయి.