‘దర్బార్’ డబ్బింగ్ షురూ..

సూపర్ స్టార్ రజనీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దర్బార్’ చిత్రం కోసం రజనీ డబ్బింగ్ స్టార్ట్ చేశారు..

  • Published By: sekhar ,Published On : November 15, 2019 / 09:46 AM IST
‘దర్బార్’ డబ్బింగ్ షురూ..

Updated On : November 15, 2019 / 9:46 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దర్బార్’ చిత్రం కోసం రజనీ డబ్బింగ్ స్టార్ట్ చేశారు..

సూపర్ స్టార్ రజనీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దర్బార్’.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు  శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘దర్బార్’ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో రజనీ ‘ఆదిత్య అరుణాచలం అనే పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు.. రీసెంట్‌గా తన క్యారెక్టర్‌కి సంబధించి డబ్బింగ్ స్టార్ట్ చేశారు సూపర్ స్టార్.. రజనీ డబ్బింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా.. ఆదిత్య అరుణాచలం పాత్ర కోసం రజనీ తనదైన స్టైల్‌లో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్తున్నారు’ అంటూ రజనీ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది మూవీ టీమ్..

Read Also : సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న”రాజమౌళి-999″ ట్రైలర్

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ కీలక పాత్రలో కనిపించనుంది. నయనతార కథానాయికగా నటించిన ‘దర్బార్’.. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.. సంగీతం : అనిరుధ్, కెమెరా : సంతోష్ శివన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్.