రజినీ ‘దర్బార్’ : దీపావళి శుభాకాంక్షలు
దీపావళి సందర్భంగా ’సూపర్ స్టార్’ రజినీకాంత్, ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార జంటగా నటిస్తున్న ‘దర్బార్’ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..

దీపావళి సందర్భంగా ’సూపర్ స్టార్’ రజినీకాంత్, ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార జంటగా నటిస్తున్న ‘దర్బార్’ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..
‘సౌత్ ఇండియన్ సూపర్ స్టార్’ రజినీకాంత్, ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార జంటగా, ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్‌లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా ‘దర్బార్’. రీసెంట్‌గా ‘దర్బార్’ షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు.. దాదాపు 25 ఏళ్ళ తర్వాత రజినీ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. రెండు వైవిధ్య భరితమైన కోణాల్లో ఆయన క్యారెక్టర్ సాగుతుందట.
రజినీ ఇమేజ్‌కి తగిన కథా కథనాలతో మురుగదాస్ ‘దర్బార్’ తెరకెక్కించారని కోలీవుడ్ మీడియా సమాచారం. దీపావళి సందర్భంగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది ‘దర్బార్’ టీమ్.. రజినీ గన్ పట్టుకుని ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, 25 ఏళ్ళ తర్వాత రజీని సినిమాకి పనిచెయ్యడం విశేషం.
బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్‌గా నటించగా.. మరో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్ర చేశారు. నివేదా థామస్ రజినీ కూతురుగా కనిపించనుంది. తంబి రామయ్య, శ్రీమాన్, యోగిబాబు తదితరులు నటించిన ‘దర్బార్’ 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కెమెరా : సంతోష్ శివన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, సంగీతం : అనిరుధ్, లిరిక్స్ : వివేక్, నిర్మాత : సుబాస్కరన్.
Happy Deepavali ?@rajinikanth @ARMurugadoss @santoshsivan @anirudhofficial @sreekar_prasad #Darbar #darbarpongal pic.twitter.com/d7EKDVGURP
— Lyca Productions (@LycaProductions) October 26, 2019