ఏప్రిల్ 12న మోహన్ లాల్ ‘లూసిఫర్’ విడుదల

మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి అన్ని భాషలలో మంచి ఆదరణ ఉంది. ఆయన ఎంచుకునే విభిన్నమైన కథలు ప్రేక్షకులను ఎప్పుడూ థ్రిల్ కు గురి చేస్తూనే ఉంటాయి. తెలుగులో ‘జనతా గ్యారేజ్’, ‘మనమంతా’, ‘మన్యం పులి’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ లాల్. తాజాగా ఆయన పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో లూసిఫర్ అనే చిత్రం చేశారు. ఇందులో మోహన్ లాల్ సరసన మంజూ వారియర్ కథానాయికగా నటించింది. కీలకమైన పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించారు. దీపక్ సంగీతాన్ని సమకూర్చారు.
అంతేకాదు కేరళలో కలెక్షన్స్ పరంగా బాహుబలి 2 చిత్ర రికార్డుని కూడా బ్రేక్ చేసిన ఈ మూవీని తెలుగులోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఏప్రిల్ 12న తెలుగులో విడుదల చేయబోతోంది. తెలుగులోను లూసిఫర్ చిత్రం మంచి విజయం సాధిస్తుందని టీం భావిస్తుంది.