Siddharth: లండన్‌లో హీరో సిద్దూకి సర్జరీ!

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, అనగనగా ఓ ధీరుడు, ఓయ్, బావా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్ధ్ ఈ మధ్య కాస్త వెనకబడ్డాడు. చాలాకాలంగా తెలుగుకు..

Siddharth: లండన్‌లో హీరో సిద్దూకి సర్జరీ!

Siddharth

Updated On : September 24, 2021 / 1:07 PM IST

Siddharth: నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, అనగనగా ఓ ధీరుడు, ఓయ్, బావా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్ధ్ ఈ మధ్య కాస్త వెనకబడ్డాడు. చాలాకాలంగా తెలుగుకు దూరమైన సిద్దార్ధ్ ఇప్పుడు మళ్ళీ శర్వానంద్ తో కలిసి మహాసముద్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మహాసముద్రం ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేయగా ఈ సినిమాతో మరోసారి తెలుగులో సిద్దూ బిజీ కావాలని గట్టి ఆశలే పెట్టుకున్నాడు.

Poonam Bajwa: ఇన్నోసెంట్ లుక్స్.. హాట్ పోజులతో రెచ్చిపోయిన పూనమ్

ఇదిలా ఉండగా ప్ర‌స్తుతం సిద్దార్థ్ లండ‌న్‌లో ఉన్నాడని.. తనకి అక్కడి వైద్యులు సర్జరీ చేశారని సినిమా పరిశ్రమలో ప్రచారం మొదలై అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సిద్ధార్థ్ త‌న సర్జరీకి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోండగా.. సిద్దూ సర్జరీ విష‌యం తెలిసాక ఆయ‌న అభిమానులు త్వ‌ర‌లో కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు.

Manyavar Kanyadaan: అలియా యాడ్ దుమారం.. బాయ్‌కాట్ ‘మన్యవర్’ ట్రెండ్స్!

గత రెండు రోజుల క్రితం సిద్దూ నటించిన మ‌హా స‌ముద్రం ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి దర్శకుడు అజయ్ భూపతి, హీరో-హీరోయిన్లు శర్వానంద్, అనూ ఇమ్మాన్యుయేల్ తో పాటు సాంకేతిక నిపుణులు కూడా హాజరయ్యారు. కానీ ఈవెంట్ లో సిద్ధార్థ్ కనిపించకపోవడంతో అభిమానులు ఆరా తీశారు. లండన్ సర్జరీ కారణంగానే సిద్దూ ఈ ఈవెంట్ కి రాలేకపోయాడని.. సినిమా విడుదల సమయానికి కోలుకొని ఇండియాకి వస్తాడని చెప్తున్నారు.