Suriya42: సూర్య 42వ చిత్రం బిగ్ అప్డేట్.. టైటిల్ అనౌన్స్మెంట్కు ముహూర్తం ఫిక్స్!
తమిళ హీరో సూర్య నటిస్తున్న 42వ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది.

Suriya42 Movie Title Announcement Date And Time Locked
Suriya42: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 42వ చిత్రానికి సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా నుండి తాజాగా ఓ బిగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.
Suriya 42 : సూర్య సినిమా హిందీ రైట్స్ 100 కోట్లకు అమ్ముడుపోయాయ?
ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను ఏప్రిల్ 16న ఉదయం 9.05 గంటలకు చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో సూర్య పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాను పీరియాడిక్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఇందులో ఓ యోధుడి పాత్రలో సూర్య మనకు కనిపిస్తాడు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఈ సినిమాను ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Suriya 42: సూర్య సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రభాస్.. మోషన్ పోస్టర్ అదిరిపోయిందిగా
ఈ బిగ్ అప్డేట్తో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిషా పటానీ హీరోయిన్గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని 3D ఫార్మాట్లోనూ రిలీజ్ చేయనున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు ఎలాంటి టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేస్తుందో చూడాలి.
Warrior enters across the showers of glory and trumpets of Thunderstorms!
Get ready to welcome #Suriya42 Title Announcement on April 16, at 9.05 a.m. ?
A Mighty Valiant Saga In 10 Languages ?@Suriya_offl @DishPatani @directorsiva @StudioGreen2 @kegvraja @UV_Creations pic.twitter.com/mcSOzkhq1L
— UV Creations (@UV_Creations) April 11, 2023