Suriya – Balayya : బాలయ్య కాళ్లకు నమస్కరించిన సూర్య.. ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేసి..
సూర్యకు బాలయ్య గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.

Surya bowed to Balakrishna feet in Unstoppable Show
Suriya – Balayya : ఆహాలో బాలయ్య అన్‌స్టాపబుల్ నాలుగో సీజన్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ అవ్వగా నేడు మూడో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ కు తమిళ్ స్టార్ హీరో సూర్యతో పాటు కంగువ టీమ్ తరపున బాబీ డియోల్, డైరెక్టర్ శివ వచ్చి సందడి చేసారు.
సూర్యకు బాలయ్య గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. బాలయ్య.. నేను సింహం అయితే అతను సింగం, నేను లెజెండ్ అయితే అతను గజిని, నేను అఖండ అయితే అతను రోలెక్స్ అంటూ సూర్యకు వెల్కమ్ చెప్పాడు. సూర్య రావడంతోనే బాలయ్య కాళ్లకు నమస్కరించాడు. అనంతరం ఇద్దరు కలిసి గజిని సినిమాలోని హృదయం ఎక్కడున్నది.. సాంగ్ కు సరదాగా స్టెప్పులు వేశారు. తర్వాత ఇద్దరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
Also Read : Suriya – Jyotika : జ్యోతిక లేకుండా నా లైఫ్ ఊహించుకోలేను.. బాలయ్య షోలో జ్యోతికకు ఐ లవ్ యు చెప్పిన సూర్య..
ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. సూర్య అలా రావడంతోనే బాలయ్య కాళ్లకు నమస్కరించడంతో ఫ్యాన్స్ ఫిదా అయి సూర్యని అభినందిస్తున్నారు. మీరు కూడా ప్రోమో చూసేయండి..