SV Krishna Reddy: ‘భారీ తారాగణం’ ట్రైలర్ లాంచ్.. మంచి హిట్ అవుతుందన్న డైరెక్టర్ ఎస్వీ.కృష్ణారెడ్డి
బివిఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై దర్శకుడు శేఖర్ ముత్యాల తెరకెక్కించిన తాజా చిత్రం ‘భారీ తారాగణం’. సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను బి.వి.రెడ్డి నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రేక్షకాదరణ లభించింది. కాగా, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

SV Krishna Reddy Launches Bhari Taraganam Movie Trailer
SV Krishna Reddy: బివిఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై దర్శకుడు శేఖర్ ముత్యాల తెరకెక్కించిన తాజా చిత్రం ‘భారీ తారాగణం’. సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను బి.వి.రెడ్డి నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రేక్షకాదరణ లభించింది. కాగా, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
Dasara Movie: దసరా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. అంచనాలు పెంచేసిన కొత్త పోస్టర్!
ఈ ట్రలర్ లాంచ్ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు SV. కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, కమెడియన్ ఆలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు యస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడు శేఖర్, నిర్మాత బివి.రెడ్డిలు మంచి బలం ఉన్న కథను సెలెక్ట్ చేసుకుని చాలా బాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు సుక్కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆలీ ఎలాంటి పాత్ర ఇచ్చినా ఏమాత్రం వెనకాడకుండా పాత్రలో ఒదిగిపోతాడు. ఈ సినిమాలో కూడా ఆలీ చాలా బాగా నటించాడు. నాకు ఇష్టమైన బాబా గారి కొడుకు ఇందులో హీరోగా చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలో మీ ముందుకు వస్తున్న ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
Veyi Subhamulu Kalugu Neeku : ఆహాలో ఆకట్టుకుంటోన్న విజయ్ రాజా ‘వేయి శుభములు కలుగు నీకు’..
ఇక నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. ఆలీ ఈ సినిమాలో చాలా చక్కగా నటించాడు. ఈ సినిమా చేసిన దర్శకనిర్మాతలకు మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో నటించిన వారందరూ చాలా చక్కగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’ అని అన్నారు. కమెడియన్ ఆలీ మాట్లాడుతూ.. ‘‘మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన దర్శకనిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో మా అన్న తమ్ముడు సదన్ హీరోగా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. తను ఇలాగే మంచి చిత్రాలలో నటించి పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర లభించింది. ఇలాంటి మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అని అన్నారు.